ఈ రోజుల్లో మనం ఒకోసారి సొంత కుటుంబ సభ్యులనే నమ్మలేము. అలాంటిది బయటికి వారికీ ఏదైనా బాధ్యతలు అప్పచెప్పగలమా.. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఓ మహిళను కంపెనీలో ముఖ్యమైన పోస్టులో నియమించారు. ఈ మహిళ పేరు ఇరా బింద్రా. ఆమె కొత్త గ్రూప్ ప్రెసిడెంట్ ఆఫ్ పీపుల్, లీడర్‌షిప్ అండ్ టాలెంట్‌గా నియమితులయ్యారు. ఇరా బింద్రా ఇంతకుముందు ఇండియాలో అలాగే ప్రపంచంలోని పలు కంపెనీలలో పనిచేశారు.
ముఖేష్ అంబానీ తీసుకున్న ఈ నిర్ణయంకి సోషల్ మీడియాలో ప్రశంసలు కూడా వస్తున్నాయి. నిజానికి అంబానీ తన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)లో ఒక మహిళకు కీలక బాధ్యతలను అప్పగించారు. కుటుంబ వ్యక్తులు కాకుండా బయటి వ్యక్తిని కంపెనీలో ఇంత పెద్ద హోదాలో తీసుకోవడం ఇదే తొలిసారి. అంబానీ ఈ నిర్ణయం పై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరా బింద్రాను పీపుల్, లీడర్‌షిప్ అండ్ టాలెంట్ కొత్త గ్రూప్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఆయిల్ టు రిటైల్ వరకు వ్యాపారం నిర్వహిస్తున్న ఈ కంపెనీలో టాలెంట్ మేనేజ్‌మెంట్‌తో సహా కీలక బాధ్యతలు ఆమె చేపట్టనుంది. రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చేరిన అంబానీ కుటుంబ సభ్యులు కానీ మొదటి మహిళ అండ్ అతి పిన్న వయసురాలు కూడా.
ఇరా బింద్రా ఎవరు?
ఇరా బింద్రా వయసు 47 ఏళ్లు. ఆమె యుఎస్ లోని మెడ్‌ట్రానిక్‌లో హెచ్‌ఆర్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ రీజియన్)గా ఉన్నారు. ఆమె ఈ కంపెనీ నుంచి నేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నియమితులయ్యారు. ఇరా బింద్రాను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ స్వయంగా నియమించారు.

ఇరా బింద్రాకి గతంలో ప్రపంచంలోని పలు పెద్ద కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆమె GE క్యాపిటల్, GE ఇండియా, GE హెల్త్‌కేర్ ఇంకా GE ఆయిల్ & గ్యాస్ వంటి ప్రముఖ కంపెనీలతో కలిసి పనిచేశారు. ఆమె మే 2018లో మెడ్‌ట్రానిక్‌లో చేరారు.
ఢిల్లీ నుంచి చదువు
ఇరా బింద్రా ఢిల్లీలో చదువుకున్నారు. అయితే ఉన్నత చదువుల కోసం ఇండియా నుండి విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. బింద్రా ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుండి పట్టభద్రులయ్యారు. దీని తర్వాత ఆమె పై చదువుల కోసం నెదర్లాండ్స్ వెళ్లింది. అక్కడ ఆమె నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్లో MBA పూర్తి చేసారు. ఆమె కెరీర్‌లో భారతదేశం, అమెరికా, ఆసియా, యూరప్ ఇంకా లాటిన్ అమెరికాతో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో పనిచేశారు.


Click it and Unblock the Notifications