Mukesh Ambani: కొడుకుపెళ్లి చేసినా మారని ముఖేష్ అంబానీ.. ఏమైందంటే..??

Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏ పని చేసినా దానివెనుక పెద్ద ప్లానింగ్ ఉంటుంది. దానికి ఉదాహరణ ఇటీవల తన చివరి కుమారుడు అనంత్ వివాహంతో ప్రపంచంలోనే పెద్ద పీఆర్ ప్లాన్ నిర్వహించటమే. ప్రపంచం ముందు తన కుమారుడు మంచివాడనే ముంద్ర దాదాపుగా అన్ని ప్రయత్నాలూ ఈ వివాహ వేడుక వెనుక జరిగాయనే డిస్కషన్ కొనసాగుతోంది.

ఈ క్రమంలో పెట్రోలియం నుంచి టెలికాం, రిటైల్ రంగాల వరకు వ్యాపారాలను విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ స్థాయిలో ముఖేష్ అంబానీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వివిధ వ్యాపారాల్లోకి పిల్లలను తీసుకొచ్చి వారికి బాధ్యతలు అప్పగించినప్పటికీ పైనుంచి వాటిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈసారి సైతం వరుసగా నాలుగో వార్షిక సంవత్సరానికి కంపెనీ నుంచి ఎలాంటి వేతనాన్ని ఆయన అందుకోలేదని వెల్లడైంది. అయితే అంబానీ వారసులు మాత్రం రిలయన్స్ గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో చేరి 'సిట్టింగ్ ఫీజు', 'కమీషన్' అందుకోవటం గమనార్హం. కంపెనీ సమావేశాలకు హాజరు కావడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డులోని స్వతంత్ర సభ్యులకు 'సిట్టింగ్ ఫీజు' చెల్లించబడుతుంది.

Reliance Industries Chairman Mukesh Ambani Receives Zero compensation 4th year too

అంబానీ 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయటంతో 2020-21 నుంచి కంపెనీ, దాని అన్ని వ్యాపారాలు తమ సంపాదన సామర్థ్యానికి పూర్తిగా తిరిగి వచ్చే వరకు గ్రూప్ నుంచి వేతనం అందుకోకూడదని నిర్ణయించారు. దీంతో 2023-24లో సైతం కంపెనీ నుంచి అలవెన్సులు, పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో సున్నా రూపాయలు అందుకున్నారు.

అంబానీ 1977 నుంచి రిలయన్స్ డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. జూలై 2002లో తన తండ్రి, గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణించినప్పటి నుంచి అంబానీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఏప్రిల్ 2029 వరకు ఐదేళ్ల పదవీకాలానికి గతేడాది రిలయన్స్ చీఫ్‌గా ముఖేష్ అంబానీ తిరిగి నియమితులయ్యారు. ఈ కాలం పూర్తయ్యే వరకు కంపెనీ నుంచి ఎలాంటి మెుత్తాన్ని పొందకూడదని నిర్ణయించుకున్నారు. అయితే వ్యాపార పర్యటనల సమయంలో ప్రయాణం, భోజనం, వసతి కోసం చేసిన ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగి ఉంటారు.

అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కంపెనీ ఏర్పాట్లు చేస్తుంది. దీని కోసం కంపెనీ భరించే ఖర్చులు పెర్క్విజిట్‌లుగా పరిగణించబడవని పేర్కొంది. ప్రస్తుతం రిలయన్స్‌లో అంబానీ కుటుంబానీకి 332.27 కోట్ల షేర్లు అంటే 50.33 శాతం వాటాను కలిగి ఉన్నారు. వీటి వల్ల 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ నుంచి రూ.3,322.7 కోట్ల ఆదాయాన్ని డివిడెండ్ రూపంలో అందుకున్నారు. అలాగే అంబానీ కజిన్‌లు నిఖిల్, హితల్ మెస్వానీల జీతం రూ.25.31 కోట్లు, రూ.25.42 కోట్లుగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వేతనం రూ.17.93 కోట్లకు పెరిగింది. ఇక పిల్లలు ఇషా, ఆకాష్ అనంత్ - గత ఏడాది అక్టోబర్‌లో సున్నా జీతంతో డైరెక్టర్ల బోర్డులో నియమితులయ్యారు. ఈ ముగ్గురూ ఒక్కొక్కరికి రూ.4 లక్షలు సిట్టింగ్ ఫీజు, రూ.97 లక్షలు కమీషన్‌గా అందుకున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+