ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం.. తన రిటైల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటోంది. ఇప్పటికే రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ ఫుట్ ప్రింట్, రిలయన్స్ ట్రెండ్స్ పేరుతో దేశవ్యాప్తంగా తన ఔట్‌లెట్లను నెలకొల్పిన రిలయన్స్.. తాజాగా.. ఫార్మసీ రంగంలో అడుగు పెట్టింది. మందుల షాపులను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఫార్మసీ రంగంలో తన చిల్లర వర్తక కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. దీనికోసం నెట్‌మెడ్స్ ఫార్మసీ సంస్థలో భారీగా పెట్టుబడులను పెట్టింది. దీని విలువ 620 కోట్ల రూపాయలు.

నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటా..
నెట్‌మెడ్స్ బ్రాండ్ నేమ్‌గా కొనసాగుతోన్న వైటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ మూలధనంలో 60 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ప్రస్తుతం నెట్‌మెడ్స్‌లో ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్‌మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్, దధా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం కూడా వాటితో జత కలిసింది. 620 కోట్ల రూపాయల పెట్టబడులతో 60 శాతం వాటాను కొనుగోలు చేసింది. చెన్నైకి చెందిన దధా ఫార్మా కంపెనీ నెట్‌మెడ్స్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది.

డిజిటల్ యాక్సెస్.. మరింత సరళీకృతం
ప్రతి ఒక్కరికీ డిజిటల్ యాక్సెస్‌ను కల్పించడంలో భాగంగా తాము నెట్‌మెడ్స్‌లో పెట్టుబడులను పెట్టినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. హెల్త్‌కేర్ రంగంలో అడుగు పెట్టడం సంతోషంగా ఉందని, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో వాటిని విక్రయిస్తామని పేర్కొన్నారు. టాప్ ఆన్‌లైన్ బిజినెస్ కంపెనీ అమేజాన్.. ఇ-ఫార్మసీలో అడుగు పెట్టింది. ఆశించిన ఫలితాలను సాధిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ యాజమాన్యం కూడా ఇ-ఫార్మసీలో ప్రవేశించిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమేజాన్‌కు పోటీ?
అమేజాన్ ఫార్మసీ పేరుతో కొద్దిరోజుల కిందటే బెంగళూరులో ఆ సంస్థ ఇ-ఫార్మసీ ప్రాజెక్టును ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇ-ఫార్మా రంగానికి మంచి డిమాండ్ లభిస్తుండటంతో క్రమంగా దాదాపు అన్ని సంస్థలూ ఈ రంగంపై దృష్టి సారించాయి. ప్లిప్‌కార్ట్ కూడా త్వరలోనే ఇ-ఫార్మసీని ప్రారంభించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెడ్‌లైఫ్‌లో పార్మాఈజీ కంపెనీ విలీనం అయ్యే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

రిలయన్స్ ఫ్యామిలీలో మేమూ
దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కుటుంబంలో చేరడం గర్వంగా ఉందంటూ నెట్‌మెడ్స్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రదీప్ దధా తెలిపారు. డిజిటల్, రిటైల్, టెక్ ప్లాట్‌ఫామ్స్ మరింత బలోపేతమౌతాయని, వినియోగదారుడికి మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడానికి వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పోటీ వాతావరణాన్ని తాము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సామాన్యుడికి నాణ్యమైన హెల్త్‌కేర్ ఉత్పత్తులు అందుబాటు ధరల్లో విక్రయించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications