RIL Bonus Shares: ఇటీవలి కాలంలో చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన పెట్టుబడిదారులకు తీపి కబురు చెప్పారు. దీనికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు కీలక ఆమోదాన్ని తెలిపింది.
భారత స్టాక్ మార్కెట్లో వాల్యుయేషన్ పరంగా అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న రిలయన్స్ తన పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన 47వ వార్షిక సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం వెలువడగా, నేడు కంపెనీ బోర్డు ఇందుకోసం తన ఆమోదాన్ని తెలిపింది. దీంతో 1:1 నిష్పత్తిలో బోనస్ ఇష్యూపై ఆమోదం లభించింది. దీని ప్రకారం అర్హులైన పెట్టుబడిదారులు తాము హోల్డ్ చేస్తున్న ప్రతి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై ఒక షేరును బోనస్ రూపంలో అందుకోనున్నారు. అయితే నిర్ణయం వెలువడిన తర్వాత కంపెనీ షేర్లు స్వల్ప క్షీణతను చూశాయి.

కంపెనీ తాజాగా బోనస్ షేర్లను ప్రకటించినందున మార్కెట్లో త్వరలో రిలయన్స్ స్టాక్స్ సంఖ్య పెరగనుంది. దీనికి ముందు చివరిగా 2017లో కంపెనీ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించిన విషయం తెలిసిందే. కంపెనీ గత చరిత్రను పరిశీలిస్తే రిలయన్స్ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ప్రకటించటం ఇది ఐదోసారి. అలాగే తాజా మీటింగ్ లో కంపెనీ అధీకృత షేర్ క్యాపిటల్‌ను పెంచుకోవడానికి కూడా ఆమోదం లభించింది. దీంతో రూ.15 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లకు క్యాపిటల్ పెంచబడుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది.
ఇదే సమయంలో బ్రోకరేజీల అభిప్రాయాన్ని పరిశీలిస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచడానికి, ఈక్విటీ బేస్ను విస్తరించడానికి బోనస్ షేర్లను జారీ చేస్తున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. ఈ క్రమంలో అధిక షేర్ల ధరలు కొత్త పెట్టుబడిదారులను నిరుత్సాహపరచవచ్చు. మొత్తం మూలధనంలో ఎటువంటి మార్పు లేనప్పుడు షేర్ల సంఖ్యను పెంచడం వల్ల ఒక్కో షేరు ధర తగ్గుతుంది. కంపెనీ ఇప్పటి వరకు బోనస్ షేర్లను పొందటానికి అవసరమైన రికార్డు తేదీ వివరాలను ఇప్పటి వరకు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications