Reliance News: వేలాది ఎకరాల్లో రిలయన్స్ మెగా ప్లాన్.. ఆ రంగంలో ఏకంగా 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్
Ambani News: గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ నెట్ జీరో దిశగా కదలాలని భారత్ యోచిస్తోంది. దీంతో దేశీయ దిగ్గజ వ్యాపారవేత్తలు గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతున్నారు. వారిలో అంబానీ, అదానీలు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఆదాని గ్రూప్ ఈ విభాగంలో వేల కోట్లు కుమ్మరించింది. ఇకపోతే అంబానీ తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే దిశగా భారీ ప్లాన్ కు తెర తీశారు.
గుజరాత్ లో ఏకంగా ఓ సోలార్ విలేజ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ నెలకొల్పుతోంది. ఈ ఏడాదిలోనే సోలార్ ప్లాంట్ సైతం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వేఫర్స్, పాలీ సిలికాన్, గ్లాస్, PV మాడ్యూల్స్, సెల్స్ వంటి పలు ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రణాళిక రచించింది. ఈ ప్లాంట్‌లో మొదటగా సెల్ ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది.

ఇప్పటికే తాము తయారు చేసిన సోలార్ ప్యానళ్లకు BIS సర్టిఫికెట్ లభించినట్లు పేర్కొంది. ఇతర రంగాలతో పోలిస్తే గ్రీన్ ఎనర్జీ విభాగం మరో ఐదేళ్లలో భారీ వృద్ధిని నమోదు చేయడం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని వృద్ధి పథంలో మరో స్థాయికి తీసుకెళ్లగలిగే సత్తా ఈ రంగానికి ఉందని ముఖేష్ అంబానీ బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రిఫైయర్‌లను తయారు చేసేందుకుగాను తమ కంపెనీ ప్రభుత్వ సహాయానికి అర్హత సాధించినట్లు రిలయన్స్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడంతో పాటు వేలాదికోట్లను కుమ్మరిస్తోంది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో స్థాపించనున్న ఈ గిగా ప్లాంట్‌కు ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ గా నామకరణం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేస్తున్న 5 లక్షల కోట్లలో ఈ ప్రాజెక్ట్ ఒక భాగం.


Click it and Unblock the Notifications