Ambani-Adani: గుజరాత్‌లో అంబానీ Vs అదానీ రగడ.. సొంతగడ్డపై ఆ కంపెనీ కోసం పోటీ..!
Ambani-Adani: కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత గౌతమ్ అదానీ మళ్లీ పత స్పీడ్ అందుకున్నారు. అయితే ఈ సారి పోరుకు గుజరాత్ క్షేత్రంగా మారబోతోంది. దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు అంబానీ, అదానీ ఒక కంపెనీ కోసం సొంత రాష్ట్రంలో పోటీకి దిగటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దివాలా తీసిన కంపెనీని కొనుగోలు చేసేందుకు దిగ్గజాల మధ్య గట్టి పోటీ మెుదలైంది. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన భద్రేశ్వర్ విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు.. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, టొరెంట్ పవర్, వేదాంత, జిందాల్ పవర్ సహా 14 కంపెనీలు రేసులో నిలిచాయి. దివాలా ప్రక్రియలో ఉన్న భద్రేశ్వర్ విద్యుత్ ను సొంతం చేసుకునేందుకు వీటి మధ్య గట్టి పోటీ జరగనుందని తెలుస్తోంది.

విద్యుత్ ప్లాంట్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ మధ్య పోటీ ఎలా ఉండనుందనే దానిపై మార్కెట్లో ఆసక్తి నెలకొంది. గతంలో కూడా రెండు సంస్థలు అనేక ప్రాజెక్టుల్లో ముఖాముఖి పోటీలో నిలిచాయి. ఈ రెండు హెవీవెయిట్ కార్పొరేట్ హౌస్‌లు గతంలో SKS పవర్, ల్యాంకో అమర్‌కంటక్ పవర్ కోసం రిజల్యూషన్ ప్లాన్‌లను అందించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటిలో రెండు దూకుడుగా వేలం వేయలేదని అంతర్గత వర్గాల ద్వారా సమాచారం.
ఇప్పటికే రెండు గ్రూప్స్ తమ బిడ్లను దాఖలు చేశాయి. అలాగే పెద్ద కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్, అదానీ గ్రూప్స్ ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని చేజిక్కించుకోవటం కోసం తమ ఆసక్తిని సమర్పించాయి. భద్రేశ్వర్ విద్యుత్‌పై ఆసక్తి చూపిన ఇతర కంపెనీలు షెరీషా టెక్నాలజీస్. అనిల్ జైన్‌కు చెందిన రిఫెక్స్ ఇండస్ట్రీస్‌లో కంపెనీ ఇటీవల 22.7% వాటాను కొనుగోలు చేసింది. జేపీ ఇస్కాన్, కాండ్లా ఆగ్రో & కెమికల్స్, కచ్ కెమికల్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రారంభ బిడ్‌లను సమర్పించినట్లు సమాచారం. భద్రేశ్వర్ విద్యుత్ కు గుజరాత్‌లోని కచ్‌లో ఒక్కొక్కటి 150MW సామర్థ్యంతో రెండు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. మెుదటి యూనిట్ 2015 ఫిబ్రవరిలో పూర్తికాగా.. రెండో యూనిట్ ఫిబ్రవరి 2016లో పూర్తయింది.


Click it and Unblock the Notifications