Reliance: అంబానీ ఆఫీసులన్నీ క్లోజ్..! సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం..
Ram Mandir: అయోధ్యలో జనవరి 22న జరుగుతున్న రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశంలోని ప్రజలే కాకుండా వ్యాపార సంస్థలు సైతం ఆహ్వానిస్తున్నాయి. ఈ అపూర్వ గట్టం సందర్భంగా తమ ఉద్యోగులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.
తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అయోధ్య రామమందిర కార్యక్రమాన్ని పురస్కరించుకుని తమ సంస్థల ఆఫీసులకు సెలవుదినాన్ని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు జనవరి 22న తమ అభీష్ఠ దైవం రాముని కార్యక్రమాన్ని తిలకించేందుకు లేదా ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. ముఖేష్ అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దేశంలోని అన్ని రిలయన్స్ కార్యాలయాల్లోని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 22న రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమౌతుంది. ఈ అపూర్వ ఘట్టం ఒంటి గంటకు పూర్తవుతుందని సమాచారం. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రత్యేకంగా సగం రోజును సెలవుగా ప్రకటించింది. ఇందువల్ల సెంట్రల్ ఇండస్ట్రియల్ సంస్థలకు మధ్యాహ్నం 2.30 వరకు సెలవుదినంగా ప్రకటించబడింది.
ఇదిలా ఉండగే దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం సోమవారం నాడు మూతపడనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి శనివారం స్టాక్ మార్కెట్లకు సెలవుదినం అయినప్పటికీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రెండు సెషన్ల ట్రేడింగ్ కోసం నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ పనిచేయనున్నాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రకటన ప్రకారం నేడు మార్కెట్లు పూర్తి స్థాయిలో ట్రేడింగ్ కొనసాగిస్తాయని దీనికి బదులుగా సోమవారం మూతపడనున్నట్లు సమాచారం అందింది.


Click it and Unblock the Notifications