ముఖేష్ అంబానీకి నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సంపదసృష్టిలో అగ్రస్థానం సంపాదించింది. 2014-19 మధ్య ఈ 5 ఏళ్ల కాలంలో రూ.5.6 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. 2019 సంవత్సరానికి గాను వార్షిక సంపద సృష్టిపై మోతీలాల్ ఓస్వాల్ నివేదిక రూపొందించింది. ఈ జాబితాలో RIL అగ్రస్థానంలో నిలిచింది.
జాబితాలో సంపద సృష్టిలో తొలి 100 స్థానాల్లో నిలిచిన కంపెనీలు గతంలో ఎన్నడూ లేని విధంగా 2014-19 మధ్య రూ.49 లక్షల కోట్ల సంపదను సృష్టించాయి. ఏడేళ్ల విరామం అనంతరం RIL మరోసారి సత్తా చాటింది. 2014-19లో అతిపెద్ద సంపద సృష్టికర్తగా నిలిచింది. రెండో స్థానంలోని కంపెనీకి, RILకు మధ్య సంపద సృష్టిలో భారీ వ్యత్యాసం ఉంది.

అత్యంత వేగంగా సంపదను సృష్టించడంలో ఇండియాబుల్స్ వెంచర్స్ వరుసగా రెండోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ సంస్థ స్టాక్స్ విలువ భారీగా పెరిగింది. ఈ కంపెనీ షేరు 78 శాతం స్థూల వార్షిక వృద్ధి రేటుతో ఉంది.
ఇండస్ ఇండ్ బ్యాంకు అత్యంత సుస్థిర సంపద సృష్టికర్తగా నిలిచింది. పదేళ్ల కాలంలో అంటే 2009 నుంచి 2019 మధ్య అత్యధికంగా 49 శాతం వార్షిక వృద్ధి రేటుతో ఈ సంస్థ షేరు ప్రతిఫలాన్ని అందించింది. సంపద సృష్టిలో ఆర్థిక రంగ సంస్థలు ముందున్నాయి. ప్రయివేటు రంగ బ్యాంకులు, NBFCలు ఈ రంగంలో దూకుడును ప్రదర్శిస్తున్నాయి. కాగా, సంపద సృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలు వెనుకబడి ఉన్నాయి. టాప్ 100లో కేవలం 9 PSUలు మాత్రమే ఉన్నాయి.
సంపద సృష్టిలో 100 కంపెనీలపై మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషణ చేసింది. ఇందుకు గాను 2014-19 మధ్య కాలంలో ఆయా కంపెనీల మార్కెట్ వ్యాల్యూలో మార్పులను లెక్కలోకి తీసుకుంది. విలీనాలు, వ్యాపార విభజనలు, కొత్తగా మూలధన కేటాయింపులు, బైబ్యాక్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుంది.


Click it and Unblock the Notifications