Ram Mandir: అయోధ్యలో నిన్న జరిగిన రాముని ఆలయ ప్రారంభానికి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం రెక్కలు కట్టుకుని వాయిపోయింది. అంబానీ తన కుమార్తెతో పాటు ఇద్దరు కుమారుల కుటుంబాలతో రాముని దర్శనానికి వచ్చారు.
ఈ క్రమంలో అంబానీ కుటుంబం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.2.51 కోట్లను విరాళంగా ప్రకటించింది. సోమవారం నాడు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ దంపతులతో పాటు పూర్తి కుటుంబం హాజరయ్యారు. అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చంట్‌తో పాటు, రిలయన్స్ జియో సీఈవో ఆకాష్ అంబానీ తన భార్య శ్లోకా మెహతాతో కలిసి, ఇషా అంబానీ తన భర్త, పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్‌తో ప్రత్యేక కార్యక్రమంలో కనిపించారు.

నీతా అంబానీ రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 'జై శ్రీరాం' అని నినాదాలు చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరు కావటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని సంతోషాన్ని ప్రకటించారు. ఒక్కసారిగా రామ మందిరాన్ని కళ్లముందు చూడగానే ఆమె ఆశ్చర్యానికి గురైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే భారతీయ సంస్కృతిని చూసి గర్వంగా ఉందని అన్నారు. ఇదే క్రమంలో ముఖేష్ మాట్లాడుతూ.. భారత్ కొత్త శకానికి సాక్ష్యమివ్వడం విశేషం అని అన్నారు. అయోధ్యలోని రామమందిరం లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని అంబానీ కుటుంబం పేర్కొంది.

రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముఖేష్ అంబానీని కుటుంబ సమేతంగా ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆహ్వానించబడిన ఎంపిక చేసిన వ్యక్తుల జాబితాలో 506 మంది A-లిస్టర్‌లు ఉన్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సినీ నటులు-నటీమణులు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, పూజారులు ఉన్నారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.84 సెకన్ల 'అభిజీత్ ముహూర్తం' సందర్భంగా జరిగిన 'ప్రాణ్ ప్రతిష్ఠ'తో పాటుగా ఆలయంలో ప్రధాని మోదీ పూజలో పాల్గొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications