25 ఏళ్లలో సంపద సృష్టిలో రిలయన్స్ టాప్, ఫాస్టెస్ట్ సంస్థ ఇన్ఫోసిస్
ఆయిల్ టు టెలికం, రిటైల్ వ్యాపారాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన 25 ఏళ్లలో రూ.6.3 లక్షల కోట్ల సంపదను సృష్టించిందని మోతీలాల్ ఓస్వాల్ యాన్యువల్ వెల్త్ క్రియెషన్ నివేదిక వెల్లడించింది. 1995 నుండి ఇప్పటి వరకు చమురు నుండి రిటైల్ వరకు విస్తరిస్తూ భారీ సంపదను సృష్టించి అగ్రగామిగా నిలిచినట్లు తెలిపింది. రిలయన్స్ తర్వాత హిందూస్తాన్ యూనీలీవర్ రూ.4.9 లక్ల కోట్లు సృష్టించి రెండో స్థానంలో ఉంది. వీటిలో ఎక్కువగా సంపద గత అయిదేళ్లలోనే జరిగిందని కూడా తెలిపింది. 2015 నుండి 2020 మధ్య 4.4 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు వెల్లడించింది.

ఫాస్టెస్ట్ వెల్త్ క్రియేటర్స్
ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు కూడా భారీగా సంపదను సృష్టించినట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలిపింది. 1995లో సెన్సెక్స్ 3200 నుండి 2020 నాటికి 47,000కు చేరుకున్నట్లు తెలిపింది. 1995 మార్చిలో 3200 ఉండగా, మార్చి 2020 నాటికి 29,500గా ఉన్నట్లు తెలిపింది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు (CAGR) 9.2 శాతంగా ఉంది. ఇదే కాలంలో 100 కంపెనీలు 9.2 శాతం కంటే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చాయి. ఈ 100 కంపెనీలను ఫాస్టెస్టే వెల్త్ క్రియేటర్స్‌గా చెబుతున్నారు.

జాబితాలో ఇన్ఫోసిస్ అదుర్స్
ఇక, టాప్ 20 ఫాస్టెస్ట్ వెల్త్ క్రియేటర్స్ (కంపెనీలు) ప్రతి సంవత్సరం దాదాపు సగటున 20 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉంది. గత పాతిక సంవత్సరాల్లో ఇది 30 శాతం రిటర్న్స్ అందించింది. ఫెవికాల్ మేకర్ పిడిలైట్ ఇండస్ట్రీస్, ఐచర్ మోటార్స్, బెర్జర్ పేయింట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు మంచి రిటర్న్స్ ఇచ్చిన వాటిలో ఉన్నాయి.

25 ఏళ్లలో...
గత 25 ఏళ్లలో పలు కన్స్యూమర్ కంపెనీలు అధిక మొత్తంలో సంపదను సృష్టించాయి. ఈ రంగం దాదాపు 12 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. ఆయిల్, గ్యాస్ రంగం 6.9 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. శ్రీసిమెంట్స్ 9 శాతం నుండి 41 శాతం ఎగబాకింది. టాప్ 100 కంపెనీల్లో పలు సంస్థలు ఏడాదికి 17 శాతం చొప్పున పాతిక సంవత్సరాలు ఎగిశాయి. 1995 నుండి షేర్ ధరలు 17 శాతం వరకు పెరిగాయి. ఇప్పటికీ టాప్ 25 స్టాక్స్ మెరుగ్గా ఉన్నాయి. వీటి షేర్ ధరలు 23 శాతంగా ఉన్నాయి. మిగతావన్నీ కలిస్తే 22 శాతం పెరిగాయి.

టాప్ కంపెనీలు ఇవే
1995 నుండి బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్స్‌లో రిలయన్స్, హిందూస్తాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్రా, ఐటీసీ, ఏషియన్ పేయింట్స్, నెస్ట్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, సన్ ఫార్మా, టైటాన్ కంపెనీ, దాబుర్ ఇండియా, పిడిలైడ్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ జింగ్, బ్రిటానియా, బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, బర్జర్ పేయింట్స్, సీమెన్స్, ఐచర్ మోటార్స్, పీ అండ్ జీ హైజీన్, టోరెంట్ ఫార్మా ఉన్నాయి.


Click it and Unblock the Notifications