iPhone: ఆపిల్ లవర్స్‍కి గుడ్‍న్యూస్.. అక్కడ లక్ష లోపే ఐఫోన్ 15 ప్రో దక్కించుకోండి..!
Apple iPhone 15 Pro: భారతదేశంలో ప్రజల ఆదాయాలతో పాటు జీవన ప్రమాణాలు సైతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది లగ్జరీ వస్తువుల కొనుగోలుకు మెుగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖరీదైన మెుబైల్స్ కి కూడా మార్కెట్ పుంజుకుంది. ఈ క్రమంలో ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఇండియాలో ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ ప్రియులకు ఒక శుభవార్త ఇక్కడ ఉంది.
ఐఫోన్ 15 ప్రో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకే కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది. అంబానీకి చెందిన రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ ఈ ఉత్పత్తిపై భారీ డిస్కౌంట్లను కొనుగోలుదారులకు ఆఫర్ చేస్తోంది. దేశంలోని ఇతర ఈకామర్స్ వెబ్‌సైట్ ఆఫర్ చేయని తక్కువ ధరకు రిలయన్స్ అందించటం గమనార్హం. గతంలో పండుగ సేల్ సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దీనిని తక్కువ రేటుకు అందించినప్పటికీ ప్రస్తుతం రిలయన్స్ కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నాయి. ఐఫోన్ 16 లాంచ్ తర్వాత పాత మోడళ్లపై తగ్గింపులను విక్రయదారులు క్రమంగా పెంచుతున్నారు. దీనిని చాలా మంది ఐఫోన్ లవర్స్ ఉపయోగించుకుంటున్నారు.

ప్రస్తుతం iPhone 15 Pro మోడల్ రిలయన్స్ డిజిటల్‌లో రూ.99,900కి అందుబాటులో ఉంది. వాస్తవానికి ఐఫోన్ 15 ప్రో మోడల్ ఇండియాలో రూ.1,34,999కి ప్రారంభించబడింది. అయితే ఇది ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్ లో రూ.35,099 తగ్గింపుతో రూ.99,900 వద్ద విక్రయించబడుతోంది. క్రెడిట్ కార్డుపై కొనుగోలుతో రూ.10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ 15 ప్రో కేవలం రూ.89,900కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై గొప్ప ఆఫర్‌లను కూడా అందిస్తుంది. ఈ 2 క్రెడిట్ కార్డులపైనే కాకుండా ఇతర బ్యాంకుల కార్డులపై కూడా డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రో మోడల్ దేశంలో రూ.1,19,900కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 ప్రోలో మెరుగైన కెమెరా, శక్తివంతమైన చిప్ కూడా ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రోమోషన్ టెక్నాలజీతో కూడిన 6.10-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ మోడల్ గేమింగ్ నుంచి రోజువారీ ఉపయోగం వరకు ప్రతిదానికీ అనుకూలంగా ఉంది. అందుకే ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు ఐఫోన్ 15 ప్రో మోడల్‌ను ఇష్టపడుతున్నారు. A16 బయోనిక్ చిప్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఫోటో, వీడియో నాణ్యతను మెరుగుపరిచే కొత్త 48MP కెమెరాతో వెనుక కెమెరా దోహదపడుతోంది.


Click it and Unblock the Notifications