ముఖేష్ అంబానీ ఇంధన రంగం నుంచి టెలికాం, రిటైల్, ఫైనాన్షియల్ ఇలా ఒక్కో రంగంలో అగుడు పెరుతున్నారు. దాదాపు ప్రతి రంగంలో తమ కంపెనీ ఉండాలన్ని ఉద్దేశంతో ముందడుగేస్తున్నారు. తాజాగా రిలయన్స్ హస్పిటాలిటీ రంగంలోకి అగుడు పెట్టింది. భారత్, UK హోటళ్లు నిర్వహించడానికి ది ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ (ఒబెరాయ్)తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ప్రకటించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో రాబోయే అనంత్ విలాస్ హోటల్, UKలోని ఐకానిక్ స్టోక్ పార్క్, గుజరాత్‌లో మరో ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్ట్ ఉన్నాయి.
ఒబెరాయ్ నడుపుతున్న ఐకానిక్ లగ్జరీ 'విలాస్' పోర్ట్‌ఫోలియోలో భాగంగా అనంత్ విలాస్ మొదటి మెట్రో-సెంట్రిక్ ప్రాపర్టీగా భావించబడిందని RIL ఒక ప్రకటనలో తెలిపింది. "అనంత్ విలాస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతంలో ఉంది. ఇది వ్యాపారం ఆతిథ్యం, షాపింగ్, F&B, కళలు, సంస్కృతి, విద్యా, నివాస ఉపయోగాలు, పౌరులు, సందర్శకుల రద్దీతో కూడిన ప్రదేశం. అనంత్ విలాస్ వివేకం గల సందర్శకులకు ఐకానిక్ అనుభవంతోహోటల్ పాదముద్రను పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది" అని RIL తెలిపింది.

"ఐరోపాలో అత్యధిక రేటింగ్ పొందిన గోల్ఫ్ కోర్సులు" ఉన్నాయి. "సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి, దానిని ప్రపంచ-స్థాయి గమ్యస్థానంగా మార్చడానికి, అతిథులకు గొప్ప అనుభవాన్ని అందించడానికి ఒబెరాయ్ RILకి సహాయం చేస్తుంది. గోల్ఫ్ , ఇతర క్రీడా సౌకర్యాలతో సహా స్టోక్ పార్క్‌ను సమగ్రంగా అప్‌గ్రేడ్ చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి" అని RIL పేర్కొంది. గుజరాత్ రాష్ట్రంలో పర్యాటక సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరో ఐకానిక్ హోటల్ ప్రాజెక్ట్‌ను రిలయన్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. దీనికి ఇంక పేరు పెట్టలేదు.
"ప్రపంచవ్యాప్తంగా ఆతిథ్య పరిశ్రమలో అత్యుత్తమ కస్టమర్ సేవలను అందించడంలో ఒబెరాయ్ అసమానమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. ఒబెరాయ్ కి అనేక ప్యాలెస్‌లు, ఇతర చారిత్రాత్మక ఆస్తులు ఉన్నాయి. ఇవి చారిత్రాత్మక ఆస్తుల పాత్ర మరియు దృష్టిని కాపాడుతూ వస్తున్నారని" అని RIL తెలిపింది. 2022లో ఒబెరాయ్ హోటల్స్ ప్రపంచంలోని ఉత్తమ హోటల్ బ్రాండ్‌గా ఎంపికైంది. రిలయన్స్ అతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టడం కొత్తేమి కాదు. గత సంవత్సరం మాండరిన్ ఓరియంటల్ హోటల్ (న్యూయార్క్)లో 73% వాటాను దాదాపు 100 మిలియన్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ అతిథ్య రంగంలో ఐటీసీ, టాటా గ్రూపు ఇండియన్ హోటళ్లు పోటీ ఇవ్వనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications