For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కైట్రాన్‌లో రిలయన్స్ వాటా 54.46 శాతానికి పెంపు

|

దేశీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్... టెక్నాలజీ రంగ సంస్థ స్కైట్రాన్‌లో మెజారిటీ వాటాలను దక్కించుకుంది. ఇందుకు 26.76 బిలియన్ డాలర్లను వెచ్చించింది. తాజా డీల్‌తో స్కైట్రాన్‌లో కంపెనీ వాటా 54.46 శాతానికి పెరిగింది. రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ ద్వారా ఈ డీల్ కుదిరింది. ఈ మేరకు రిలయన్స్ వెల్లడించింది.

ట్రాఫిక్ రద్దీని తగ్గించే రవాణా సాధనాలకు అవసరమైన టెక్నాలజీని స్కైట్రాన్ అభివృద్ధి చేసింది. ఇన్నోవేషన్ ఎండీవర్స్ వంటి అంతర్జాతీయ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు మద్దతునిస్తున్నాయి. 2018లో రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్(RSBVL) 12.7 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అనంతరం దశలవారీగా ఈ వాటాను 26.31 శాతానికి పెంచుకుంది. తాజాగా దీనిని 54.46 శాతానికి పెంచింది.

 Reliance buys majority stake in skyTran: Ambani says committed to futuristic tech

స్కైట్రాన్‌లో మెజార్టీ ఈక్విటీ వాటా కొనుగోలు ద్వారా ప్రపంచాన్ని మార్చే భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలను నిర్మించడంలో పెట్టుబడి పెట్టడంలో తమ నిబద్ధత వెల్లడవుతోందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. చౌకగా హైస్పీడ్ ఇంట్రా, ఇంటర్-సిటీ కనెక్టివిటీని అందించేందుకు తోడ్పడే టెక్నాలజీలను రూపొందించడంలో స్కైట్రాన్ పేరెన్నిగగన్నది.

English summary

స్కైట్రాన్‌లో రిలయన్స్ వాటా 54.46 శాతానికి పెంపు | Reliance buys majority stake in skyTran: Ambani says committed to futuristic tech

Reliance Strategic Business Ventures Limited (RSBVL) said on Sunday that it has acquired additional equity stake in its investee company skyTran Inc. for a consideration of $26.76 million. With this, RSBVL's shareholding in US-based tech firm increased to "54.46% on a fully diluted basis," from the existing 26.3%, the company said in a regulatory filing.
Story first published: Monday, March 1, 2021, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X