Reliance News: రష్యా కంపెనీతో రిలయన్స్ వేలకోట్ల డీల్.. అగ్రదేశాలు వారిస్తున్నా వినకుండా..
Ambani News: కరోనా సంక్షోభం ముగిసింది అనుకుంటున్న తరుణంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఘటన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పవచ్చు. పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించగా.. భారత్ మాత్రం ఎప్పటిలాగే స్నేహ హస్తం అందించింది. అగ్ర దేశాల ఒత్తిళ్లను సైతం తోసిపుచ్చి మరీ సాయం చేసింది. అందుకు ప్రతిగా రష్యా చమురుతో భారత్ రుణం తీర్చుకుంది.
రష్యాతో చమురు డీల్ హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం భారత దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇందులో ఇన్వాల్వ్ కావడమే. పైగా రూబుల్స్‌లో పేమెంట్‌కు సైతంం అంగీకారం కుదిరినట్లు ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ నివేదించింది. ఈ విధంగా నెలకు కనీసం 3 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురు కొనుగోళ్లకు రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌తో ఏడాదిపాటు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

అమెరికా, యూరప్ సహా పలు పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో రష్యా ప్రత్యామ్యాయ వాణిజ్య మార్గాలను వెదుకుతోంది. చమురు ఉత్పత్తిదారుల సమాఖ్య OPEC జూన్ తర్వాత క్రూడ్ ఆయిల్ సరఫరాలో కోతలు పొడిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమయంలో రాయితీ ధరకు రష్యా నుంచి చమురు పొందడం రిలయన్స్ వంటి భారతీయ కంపెనీలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు.
2022లో ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా చమురుకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌కు ఇది బాగా కలిసివచ్చింది. డిస్కౌంట్‌లో దొరుకుతన్న రష్యా చమురు కోసం ఇండియా కేవలం రూపాయలతోనే కాకుండా దిర్హామ్‌లు మరియు చైనీస్ యువాన్‌లలోనూ చెల్లింపులు జరిపినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications