Reliance: దేశం గర్వించదగ్గ వ్యాపార సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే, దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖేష్ అంబానీ సారథ్యంలోని ఈ గ్రూపునకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇండియాలో అత్యంత విలువైన కంపెనీగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. తాజాగా ఈ ప్రఖ్యాత సంస్థ, ఫోర్బ్స్ గ్లోబల్ 200 జాబితాలో మరో మైలురాయిని అందుకుంది
బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫోర్బ్స్ తాజా గ్లోబల్ 2000 లిస్టులో మంచి స్థానం సంపాదించింది. గతంతో పోలిస్తే 8 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2 వేల పబ్లిక్ కంపెనీల జాబితాలో ఇదే అత్యధిక స్థానంలో ఉన్న భారతీయ కంపెనీ కావడం విశేషం.

రిలయన్స్ గ్రూపు గత సంవత్సరం ర్యాంకింగ్స్‌లో 53వ స్థానం సాధించగా.. ఈసారి 45వ స్థానానికి ఎదిగింది. 2022 ర్యాంకింగ్‌లో 105వ స్థానం నుంచి SBI 77వ స్థానానికి చేరుకుంది. HDFC బ్యాంక్ 153 నుంచి 128కి, ICICI బ్యాంక్ 204 నుంచి 163కి చేరి తమ స్థానాలను మెరుగుపరచుకున్నాయి. ఇతర భారతీయ సంస్థల్లో ONGC-226, HDFC-232, LIC-363 ఉన్నాయి. అయితే TCS మాత్రం గతేడాది ర్యాంకు 384 నుంచి 387కు పడిపోయింది. మొత్తం మీద 55 భారతీయ సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
నాలుగు పెరామీటర్స్ ఆధారంగా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు గ్లోబల్ 2000 ర్యాంక్ ఇచ్చింది. విక్రయాలు, లాభాలు, ఆస్తులు మరియు మార్కెట్ విలువను బట్టి 2023కి గాను ప్రపంచంలోని టాప్ 2 వేల కంపెనీలను ఫోర్బ్స్ గుర్తించింది. వాటికి ర్యాంకింగ్‌ను ఇస్తూ నివేదిక విడుదల చేసినట్లు తెలిపింది.
3.7 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో అమెరికాలోని అతిపెద్ద బ్యాంక్ JP మోర్గాన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే గతేడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం దాని పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో నష్టాల కారణంగా తాజా జాబితాలో 338వ స్థానానికి పడిపోయింది. సౌదీ ఆయిల్ కంపెనీ అరామ్‌కో రెండవ స్థానంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా బ్యాంకులు వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి. టెక్నాలజీ దిగ్గజాలు ఆల్ఫాబెట్ మరియు యాపిల్ వరుసగా 7, 10వ స్థానాలకు పరిమితమయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications