Train accident: ఒడిశాలో జరిగిన అత్యంత దారుణ రైలు ప్రమాద ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. బాధితులకు ప్రభుత్వంతో పాటు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు సైతం తమ వంతుగా చేయూతనిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషాద ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన బాల, బాలికల విద్యాభ్యాసానికి సహకారం అందించనున్నట్లు ఇప్పటికే అదానీ గ్రూపు ఛైర్మన్ ప్రకటించారు. ఇదే బాటలో తాజాగా రిలయన్స్ సైతం ఓ ప్రకటన చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాతృత్వ విభాగం రిలయన్స్ ఫౌండేషన్.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం అందించనుంది. వారికి 6 నెలల పాటు ఉచిత రేషన్ సహా ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించనున్నట్లు ప్రకటించింది. Jio-BP నెట్‌వర్క్ ద్వారా ఈ విపత్తులో కీలకంగా వ్యవహరించే అంబులెన్స్‌లకు ఇంధనాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. క్షతగాత్రులకు ఉచిత మందులు సహా ఆసుపత్రిలో చేరాల్సిన వారికి వైద్య చికిత్సను అందించనున్నట్లు పేర్కొంది. మొత్తం 10 విధాలుగా వారిని ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

రిలయన్స్ స్టోర్ల ద్వారా బాధిత కుటుంబాలకు వచ్చే 6 నెలల పాటు మైదా, పంచదార, పప్పు, బియ్యం, ఉప్పు, వంటనూనెతో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. "తమ వారిని కోల్పోయి విషాదంలో ఉన్న వారి బాధలను మేము తొలగించలేము. మృతుల కుటుంబీకుల జీవితాలను పునర్నిర్మించేందుకు మరియు భవిష్యత్తులో ముందుకు సాగేందుకు వివిధ రకాలుగా సాయం అందిస్తాం" అని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నీతా అంబానీ జూన్ తెలిపారు.
అవసరమైన మేరకు మరణించిన వారి కుటుంబ సభ్యులకు Jio మరియు Reliance Retail ద్వారా ఉపాధి అవకాశాలను అందిస్తుంది. మానసిక, సాంఘిక మద్దతు కోసం వారికి కౌన్సెలింగ్ సేవలను సైతం సమకూర్చనుంది. వీల్ చైర్లు మరియు కృత్రిమ అవయవాలతో సహా వైకల్యం బారినపడ్డ వ్యక్తులకు సహకారం అందించనుంది. సంపాదించే కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళలకు మైక్రోఫైనాన్స్ మరియు శిక్షణ అవకాశాలు కూడా అందించబడతాయి. గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి కోసం ఆవులు, గేదెలు, మేకలు మరియు కోళ్ల వంటి పశువులను కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications