Tata News: భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో అంబానీ మరియు టాటాల స్టామినా ఏంటో రోజూ చూస్తూనే ఉన్నాం. రెండు దిగ్గజ కంపెనీలను నెలకొల్పి ఇండియా కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ఘనులు. వీరిద్దరూ కలిసి ఓ జాయింట్ వెంచర్‌లో అడుగు పెడితే అది పక్కా హిట్ కాంబో కావడం ఖాయం.
ఇప్పటికే వాల్ట్ డిస్నీతో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కంపెనీ నుంచి టాటా ప్లేలో 29.8 శాతం వాటా కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. ఇది సాకారమైతే భారత టెలివిజన్ పంపిణీ రంగం ఓ కీలక ముందడుగు వేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

శాటిలైట్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్‌లో టాటా సన్స్‌కు 50.2 శాతం వాటా ఉంది. డిస్నీ కాకుండా మిగిలిన షేర్లు సింగపూర్ ఆధారిత ఫండ్ అయిన టెమాసెక్ యాజమాన్యంలో ఉన్నాయి. ఒప్పందం కుదిరితే టాటా గ్రూప్ మరియు రిలయన్స్ జాయింట్ వెంచర్‌లో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి అని మీడియా నివేదిక పేర్కొంది.తద్వారా టాటా ప్లే ప్లాట్‌ఫారమ్‌లో జియోసినిమా పరిధి సైతం భారీగా విస్తరిస్తుందని అంచనా వేసింది.
కంపెనీలో తన 20 శాతం వాటాను టెమాసెక్ విక్రయించాలని భావిస్తోంది. దీని విలువ దాదాపు 1 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టాటా ప్లే 4 వేల 499 కోట్ల ఆదాయంతో పాటు 105 కోట్ల నష్టాన్ని నివేదించడం గమనార్హం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications