ముంబై: రిలయన్స్ బోర్డులోకి సౌదీ ఆరామ్‌కోను తీసుకుంటున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురువారం (జూన్ 24) ప్రకటించారు. రిలయన్స్ వార్షిక సర్వసభ్య (AGM) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ ఆరామ్‌కోను వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్నారు. ఆరామ్‌కో ప్రతినిధులను రిలయన్స్ బోర్డులోకి తీసుకోనున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. అందరూ ఊహించిన విధంగా ముఖేష్ అంబానీ ఈ ప్రకటన చేశారు. రిలయన్స్ బోర్డు డైరెక్టర్‌గా సౌదీ ఆరామ్‌కోకు చెందిన యాసిర్ ఆల్‌రుమాయున్‌ను తీసుకున్నారు. యాసిర్ ఆల్‌రుమాయున్ సౌదీ ఆరామ్‌కో చైర్మన్ అలాగే, 430 బిలియన్ డాలర్ల సావరీన్ వెల్త్ ఫండ్ కింగ్‌డం గవర్నర్ కూడా.
ముఖేష్ అంబానీతో పాటు ఆయన సతీమణి నీతా అంబానీ పలు కీలక ప్రకటనలు చేశారు. జియో ఇనిస్టిట్యూట్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జియో ఇనిస్టిట్యూట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్న సేవా పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో రిలయన్స్ 75,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.

ప్రస్తుతం మనం మానవతా సంక్షోభంలో ఉన్నామని, తమ ఉద్యోగులు, వాటాదారులు చాలామంది కరోనా క్లిష్ట సమయంలో కంపెనీ కోసం ఎంతో పని చేశారన్నారు. కరోనాపై పోరులో రిలయన్స్ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రతి వంద మందిలో పది మందికి రిలయన్స్ ఆక్సిజన్ అందించినట్లు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications