IT News: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల మధ్య IT రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పలు దేశాలు సాంకేతికతపై వెచ్చించే ఖర్చులను తగ్గించుకుంటూ ఉండటంతో ఆదాయలకు గండి పడుతోంది. తాజాగా విడుదలైన యాక్సెంచర్ ఆర్థిక ఫలితాలు.. భారతీయ IT కంపెనీల గణాంకాలకు కర్టెన్ రైజర్ గా చెబుతున్నారు.
ఓ పక్క ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండగా.. ఆగస్టుతో ముగిసిన కంపెనీ ఆర్థిక సంవత్సరం Q4లో యాక్సెంచర్ 16 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 0.36 శాతం తగ్గుదల నమోదైంది. పూర్తి ఏడాదికి ఆదాయం 4.2 శాతం పెరిగి 64.1 బిలియన్ డాలర్లకు చేరింది.

కాగా FY24 సంవత్సరాదాయంతో పాటు మొదటి త్రైమాసిక రాబడిపై యాక్సెంచర్ తన అంచనాలను విడుదల చేసింది. FY24 Q1లో కంపెనీ ఆదాయ వృద్ధి -2 నుంచి 2 శాతానికి చేరవచ్చని భావిస్తోంది. పూర్తి ఏడాది మొత్తానికైతే 2-5 శాతం పరిధిలో రాబడి సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఈ గణాంకాల ఆధారంగా భారతీయ IT రంగం వృద్ధిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి ఇక్కడ త్రైమాసిక ఆదాయాల సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఇండియన్ టెక్ దిగ్గజాల నంబర్స్ అంతగా ఆకట్టుకోలేకపోవచ్చని భావిస్తున్నారు. భారతీయ IT ఇండస్ట్రీకి FY24లో సవాళ్లు తప్పవని ఇప్పటికే అంచనాలు ఉండగా.. ఏమి జరుగుతుందో వేచి చూడాలి మరి!
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications