Reko Diq mine in Balochistan: పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. IMF, ప్రపంచ బ్యాంకుల నుంచి అనేక సహాయ ప్యాకేజీలు పొందినప్పటికీ దాని సంక్షోభం మాత్రం పోవడం లేదు.దేశ ద్రవ్యోల్బణం కనిష్ట వేతనంతో జీవించే పౌరులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జీడీపీ వృద్ధిరేటు తగ్గుతోంది. అలాగే విదేశీ రుణ భారం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బలూచిస్తాన్‌లో ఉన్న రెకో డిక్ గని.. పాకిస్తాన్‌ను తిరిగి ఆర్థిక స్థిరత్వానికి తీసుకువచ్చే ఆయుధంగా మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాంగ్ మీడియా గ్రూప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అరుదైన ఖనిజాలపై కూర్చుని ఉంది. రేపటి నుండి కాదు కానీ త్వరలోనే అవి దేశానికే కాదు ప్రాంతానికే ఎంతో కీలకమైన ఆర్థిక వనరులుగా మారుతాయి. రెకో డిక్ ద్వారా వచ్చే ఏడాది నుండి సంవత్సరానికి కనీసం 2 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని తెలిపారు. చైనా వంటి దేశాలు ఇందులో భాగస్వామ్యం అయితే ఈ ఆదాయ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఒక్క గని ద్వారా పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలుస్తుందని జోస్యం చెప్పారు.

రెకో డిక్ ఏమిటి? బలూచిస్తాన్ రాష్ట్రంలోని చాగై జిల్లాలో ఉన్న ఈ గని.. ప్రపంచంలోని అతిపెద్ద రాగి-బంగారం ఖనిజ నిల్వలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని నిద్రాణ అగ్నిపర్వత ప్రాంతంలో ఉంది. రాయిటర్స్ ప్రకారం.. రెకో డిక్‌లో దాదాపు 590 కోట్ల టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఒక్కో టన్నులో సగటున 0.22 గ్రాముల బంగారం, 0.41% రాగి ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
తవ్వకాల చరిత్ర : ఈ గనిలో మొదటి తవ్వకాలు 1995లో ప్రారంభమయ్యాయి. మొదటి నాలుగు నెలల్లోనే 200 కిలోల బంగారం, 1,700 టన్నుల రాగి వెలికి తీసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే 2011లో పాకిస్తాన్ ప్రభుత్వం బారిక్ గోల్డ్ (Barrick Gold), ఆంటోఫాగాస్టా (Antofagasta) కంపెనీలకు లైసెన్స్ ఇవ్వకుండా నిరాకరించడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ గనిపై రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ యాజమాన్యంలో 50 శాతం వాటా కనడాకి చెందిన బారిక్ గోల్డ్ చేతిలో ఉంది. మిగిలిన 50 శాతం పాకిస్తాన్ సమాఖ్య, బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వాల మధ్య విభజించబడి ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలదా : నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. రెకో డిక్‌లో వాణిజ్య స్థాయిలో మైనింగ్ ప్రారంభమైతే ప్రాధమిక దశలోనే సంవత్సరానికి 2 లక్షల టన్నుల రాగి, 2.5 లక్షల ఔన్సుల బంగారం ఉత్పత్తి కావచ్చు. ఇది పాకిస్తాన్‌కు బిలియన్ల డాలర్ల వృద్ధి అవకాశాలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మెరుగయ్యేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. అంతేకాదు, విదేశీ పెట్టుబడిదారులకు స్థిరత్వం, పారదర్శక విధానాలు కనిపించాలి.. అలా కాకుంటే పూర్తి స్థాయిలో మైనింగ్ ప్రారంభం కావడం ఒక సవాలుగా మిగులుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) 2024లో రెకో డిక్ ప్రాజెక్ట్‌లో 15 శాతం వాటా కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపినట్టు నివేదికలు తెలిపాయి. దీంతో రాబోయే ఏడాదిలో ప్రాజెక్ట్‌పై కొత్త చర్యలు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications