Jhunjhunwala Stock: జున్‌జున్‌వాలా స్టాక్ వెంటపడుతున్న ఇన్వెస్టర్స్.. 5 రోజులుగా ఆగని దూకుడు..
VA Tech Wabag Stock: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ కొన్ని కంపెనీల షేర్లు మాత్రం అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జున్‌జున్‌వాలాకు చెందిన మల్టీబ్యాగర్ స్టాక్ నిరంతరం పెరుగుతూ అనూహ్యంగా రాబడులను అందిస్తోంది. ఇన్వెస్టర్లు ఎందుకు ఈ షేర్ల కోసం ఎగబడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది VA Tech Wabag కంపెనీ షేర్ల గురించే. ప్రస్తుతం కంపెనీ షేర్లు గడచిన 5 రోజులుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నేడు జున్‌జున్‌వాలా స్టాక్ నిరంతర ర్యాలీని చూస్తూ సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కంపెనీ దాదాపు రూ.1000 కోట్లు విలువైన మెగా ఆర్డర్ అందుకోవటమే దీనికి కారణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని సోలార్ పీవీ తయారీ ఫెసిలిటీ కోసం ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 100 ఎంఎల్‌డి సీ వాటర్ డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఈ ఆర్డర్ అందుకోబడింది. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.1743.85కి చేరాయి.

తాజా పెరుగుదలతో వీఏ టెక్ వాబాగ్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,528 కోట్లకు చేరుకుంది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు 284% రాబడిని అందించగా.. రెండేళ్లలో ఏకంగా 549 శాతం రిటర్న్ ఇచ్చాయి. ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా జున్‌జున్‌వాలా జూన్ 2024 త్రైమాసికం చివరి నాటికి కంపెనీలో ఏకంగా 50 లక్షల షేర్లను హోల్డ్ చేస్తున్నారు. ఇది కంపెనీలో దాదాపు 8 శాతం వాటాకు సమానంగా తెలుస్తోంది. ఏడాది కిందట అక్టోబర్ 26, 2023న కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.440.05 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో స్టాక్ ధర దీనికి మూడింతలకు పైనే ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
ఏపీలో అందుకున్న డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా డిజైన్, ఇంజనీరింగ్, సరఫరా, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమీషనింగ్ ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ పరిధి ఉంది. ప్రాజెక్టును 38 నెలల వ్యవధిలో అమలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అత్యాధునిక డీశాలినేషన్ టెక్నాలజీలతో నిర్మించబడుతున్న ప్లాంట్ 15 ఏళ్ల పాటు ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ సేవలను సైతం అందించనుంది. దీంతో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లకు ఇచ్చిన టార్గెట్ ధర రూ.1700ను నేరు చేరుకోగా బులిష్ వ్యూ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సైతం బులిష్ వ్యూతో స్టాక్ టార్గెట్ ధరను రూ.1541కి పెంచుతూ BUY రేటింగ్ అందించింది. దీంతో కంపెనీ షేర్లు మార్కెట్లో తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి.


Click it and Unblock the Notifications