Rekha Jhunjhunwala: రాకేష్ మరణించిన తర్వాత ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. దేశంలోని చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు ఇప్పటికీ వారి పోర్ట్ ఫోలియోను ఫాలో అవుతున్నారు. తాజాగా ఇందులోని ఒక స్టాక్ మార్కెట్లో విజృంభించింది.

రేఖా జున్‌జున్‌వాలా..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది రేఖా పోర్ట్‌ఫోలియోలోని నాగార్జున కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ స్టాక్ ఎన్ఎస్ఈలో 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చాలా కాలం నెమ్మదిగా ఉన్న స్టాక్ ప్రస్తుతం జోరును కొనసాగిస్తోంది. గడచిన 6 నెలల్లో స్టాక్ 30 శాతం ర్యాలీ చేసింది. గతంలోని రికార్డులను అధిగమిస్తూ.. కొత్త గరిష్ఠమైన రూ.84 మార్కును తాకింది.

నిపుణుల అంచనాలు..
ప్రస్తుతం కంపెనీ మంచి ఆర్డర్ బుక్ కలిగి ఉందని తెలుస్తోంది. రానున్న బడ్జెట్ లో కేంద్రం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించవచ్చని తెలుస్తోంది. ఇది కంపెనీకి కూడా పరోక్షంగా కలిసొచ్చే అంశమని నిపుణులు అంటున్నారు. వీరి అంచనా ప్రకారం ప్రీ-బడ్జెట్ టార్గెట్ గా రూ.110ని స్టాక్ టార్గెట్ గా ఇచ్చారు. ఈ క్రమంలో స్టాప్ లాస్ రూ.75గా సూచించటం జరిగింది. ఇన్వెస్టర్లు సైతం కంపెనీపై మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.

IIFL సెక్యూరిటీస్..
NCC షేర్లు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా అన్నారు. కంపెనీ షేర్లు రూ.88కి చేరువైతే.. ఆ తర్వాత అవి రూ.98 స్థాయికి వెళ్లవచ్చని అంచనా వేశారు. 2023 యూనియన్ బడ్జెట్ కి ముందు కంపెనీ షేర్లు రూ.110 స్థాయిని చేరుకుంటుందని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు.

రేఖా జున్‌జున్‌వాలాకు వాటాలు..
ఈ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో రేఖా వాటాలను హోల్డ్ చేస్తున్నారు. జూలై- సెప్టెంబర్ త్రైమాసికం వివరాల ప్రకారం ఆమెకు కంపెనీలో 7,93,33,266 షేర్లు ఉన్నాయి. అంటే కంపెనీలో రేఖాకు ఏకంగా 12.64 శాతం వాటా ఉంది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి స్టాక్ రూ.83 వద్ద క్లోజ్ అయ్యింది. షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.84గా ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.52.20 గా ఉంది.


Click it and Unblock the Notifications