Year Ender 2023: రేఖా జున్‌జున్‌వాలా లాభం రూ.14,428 కోట్లు.. కీలకంగా ఆ 2 స్టాక్స్.. మీ దగ్గర ఉన్నాయా..
Rekha Jhunjhunwala: స్టాక్ మార్కెట్లు అనగానే సహజంగా చాలా మందికి గుర్తొచ్చే పేరు దివంగత బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా. అయితే ఆయన తర్వాత అనేక మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం భార్య రేఖా పోర్ట్ ఫోలియోను ఫాలో అవుతున్నారు.
2023లో రేఖా జున్‌జున్‌వాలా పోర్ట్ ఫోలియో అత్యద్భుతమైన రాబడులను అందించింది. వాస్తవానికి ఈ కాలంలో ఆమె మెుత్తం పెట్టుబడుల నుంచి రూ.14,428 కోట్లను ఆర్జించింది. ఈ క్రమంలో ప్రధానంగా టాటా మోటార్స్, టైటాన్ కంపెనీల నుంచి అత్యధికంగా రాబడులను అందుకుంది. అలాగే లిస్టింగ్ తర్వాత కాంకర్డ్ బయోటెక్ పెట్టుబడులు సైతం బలమైన రాబడులను అందించటం అధిక లాభాలకు తోడ్పడింది.

Trendlyneలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం జున్‌జున్‌వాలా పెట్టుబడుల విలువ చివరిగా రూ.48,108.40 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇది 2022 చివరి నాటి విలువ రూ.33,518 కోట్ల కంటే 43.53 శాతం అధికంగా చెప్పుకోవచ్చు. టైటాన్ కంపెనీలో సెప్టెంబర్ 30 నాటికి 5.37 శాతం వాటాను కలిగి ఉండగా దాని విలువ రూ.17,731.90 కోట్లుగా నిలిచింది. ఇక టాటా మోటార్స్ షేర్లు 88.96 శాతం పెరుగుదల కారణంగా మంచి రాబడిని ఆమె అందుకున్నారు. ఆగస్టు 18న జాబితా అయిన కాంకర్డ్ బయోటెక్ కంపెనీలో 2004 నుంచే జున్‌జున్‌వాలా ఫ్యామిలీకి పెట్టుబడులు ఉన్నాయి. లిస్టింగ్ గెయిన్స్ అధికంగా పొందారు.
ఇదే క్రమంలో వారు మెట్రో బ్రాండ్స్, క్రిసిల్, కెనరా బ్యాంక్, ఫోర్టిస్ హాస్పిటల్స్, ఎన్సీసీ, ఇండియన్ హోటల్స్ కంపెనీల్లోని పెట్టుబడులు సైతం 40-85 శాతం మధ్య రాబడులను అందించాయి. అయితే ఈ క్రమంలో కేవలం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే 8.74 శాతం నెగటివ్ రాబడిని అందించింది. అలా మెుత్తంగా 2023లోని స్టాక్ మార్కెట్లలో నమోదైన మెగా బుల్ ర్యాలీతో రేఖా జున్‌జున్‌వాలా పెట్టుబడుల విలువ భారీగానే పెరిగినట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications