టాటా కంపెనీ షేర్లు అమ్మేసిన Rekha Jhunjhunwala.. కోటి షేర్లు వదిలించుకుని..
Rekha Jhunjhunwala: ఒకప్పుడు స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లకు దివంగత బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా ఉండేవారు. అయితే ఇప్పుడు చాలా మంది ఆయన భార్య రేఖా పోర్ట్‌ఫోలియోను ఫాలో అవుతున్నారు.
తాజాగా రేఖా జున్‌జున్‌వాలా టాటా గ్రూప్ కంపెనీ అయిన రాలిస్ ఇండియాలో ఉన్న వాటాలను విక్రయించారు. కంపెనీలో తనకు ఉన్న పెట్టుబడిలో 5.5 శాతం వాటాను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించారు. ఈ విక్రయం ద్వారా 1.06 కోట్ల షేర్లు చేతులు మారాయని వెల్లడైంది.

జున్‌జున్‌వాలా కంపెనీలో 97 లక్షల షేర్లను రూ.215.05 సగటు ధరకు విక్రయించగా మిగిలిన 9,96,091 షేర్లను రూ.220.35 రేటుకు ఆఫ్‌లోడ్ చేశారు. మొత్తం మీద ఎక్స్ఛేంజీల వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం షేర్లు ఒక్కొక్కటి సగటున రూ.215.54 చొప్పున అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో ప్రమోటర్ టాటా కెమికల్స్ 97 లక్షల షేర్లను రూ.215.05 ధరకు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
పెద్ద మెుత్తంలో రాలిస్ షేర్లను విక్రయించిన తర్వాత కూడా రేఖా జున్‌జున్‌వాలా ప్రస్తుతం 43,75,000 షేర్లు లేదా 2.25 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇదే సమయంలో కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ 12.15 శాతం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు పబ్లిక్ షేర్‌హోల్డర్‌లలో కంపెనీలో 8 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో తక్కువ ఆదాయంతో నికర లాభం రూ.63 కోట్లుగా నమోదైంది.
అధిక మార్కెట్ ఇన్వెంటరీలు, బాగా ధర తగ్గడం, రుతుపవనాల ఆలస్యం కారణంగా పంట సంరక్షణ వ్యాపారం ప్రభావితమైందని రాలిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & CEO సంజీవ్ లాల్ తెలిపారు. ఇన్వెంటరీ పరిస్థితి క్రమంగా తగ్గిన తర్వాత సంవత్సరం ద్వితీయార్థంలో అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ రికవరీ గురించి జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఇటీవలి రుతుపవనాల పెరుగుదలతో దేశీయ మార్కెట్‌కు సెంటిమెంట్‌లు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications