Titan Shares: భారత స్టాక్ మార్కెట్లలో అతిపెద్ద పెట్టుబడిదారుల్లో జున్‌జున్‌వాలా కుటుంబం ప్రముఖమైనది. అందుకే రాకేష్ జున్‌జున్‌వాలా మరణించినప్పటికీ వారి కుటుంబ పోర్ట్ ఫోలియోను చాలా మంది ఇప్పటికీ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు పెట్టుబడి బాధ్యతలను ఆయన భార్య రేఖా చూసుకుంటున్నారు.
రాకేష్ జున్‌జున్‌వాలా ఉన్నప్పటి నుంచి వారి పెట్టుబడులు ఎక్కువగా టాటాలకు చెందిన టైటాన్ కంపెనీ షేర్లలో ఉండేవి. అయితే తాజాగా గతవారం చివరిలో టైటాన్ స్టాక్ తన మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. దీంతో నేడు మార్కెట్లు ప్రారంభం కాగానే టైటాన్ కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం క్షీణతను నమోదు చేశాయి. మార్కెట్ అంచనాలను నాలుగో త్రైమాసికంలో కంపెనీ అందుకోవటంలో విఫలం అవ్వటంతో స్టాక్ పతనానికి గురైంది. దీంతో రేఖా జున్‌జున్‌వాలాకు ఏకంగా నిమిషాల్లోనే రూ.805 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఆమె పెట్టుబడి సంపద వందల కోట్లలో తగ్గిపోయింది.

వివరాల్లోకి వెళితే మార్చి 31, 2024 నాటికి జున్‌జున్‌వాలా ఫ్యామిలీకి టైటాన్ కంపెనీలో 5.35 శాతం వాటాలు ఉన్నాయి. శుక్రవారం మార్కెట్లో టైటాన్ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.16,792 కోట్లుగా ఉంది. సోమవారం షేర్ ధర పతనం కారణంగా టైటాన్ మార్కెట్ క్యాప్ ఏకంగా శుక్రవారం ఉన్న రూ.3,13,868 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.2,98,815 కోట్లకు పడిపోయింది. నేడు ఇంట్రాడేలో టైటాన్ షేర్ ధర 5.18 శాతం మేర క్షీణతతో బీఎస్ఈలో ఒక్కోటి రూ.3,352.25కి పడిపోయింది.
టైటాన్ జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. జ్యూవెలరీ వ్యాపారంలో కొనసాగుతున్న కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.786 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 17 శాతం వృద్ధితో రూ.10,047 కోట్లుగా నమోదైంది. పసిడి, వెండి ధరలు విపరీతమైన పెరుగుతల క్రమంలో.. జ్యూవెలరీ వ్యాపారంలో బలహీనమైన డిమాండ్ వాతావరణం, తీవ్రమైన పోటీ వినియోగదారుల ఆఫర్‌ల కారణంగా ఆభరణాల వ్యాపారం మార్జిన్‌లు తగ్గుదలకు దారితీసినట్లు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ అభిప్రాయపడింది. అయితే కంపెనీ ఆభరణాల వ్యాపారంలో దూకుడుగా వృద్ధిని లక్ష్యంగా చేసుకుంటోంది. ఫలితాలు అంచనాలను అందుకోవటంలో విఫలమైనప్పటికీ యాంటిక్ టైటాన్ షేర్లపై BUY రేటింగ్ కొనసాగిస్తూ షేర్లకు రూ.4,017 టార్గెట్ ధరగా ప్రకటించింది. ఇది గతంలో ఇచ్చిన టార్గెట్ ధర రూ.4,100ను తగ్గించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications