మార్కెట్ దిగ్గజం రాకేష్ జున్‌జున్‌వాలా మన మధ్య లేకపోయినా ఆయన భార్య రేఖ FY23 రెండో త్రైమాసికంలో మొత్తం ఆరు స్టాక్‌లలో తమ షేరును పెంచుకున్నారు. ఆమె తన పోర్ట్‌ఫోలియోలో స్మాల్-క్యాప్ స్టాక్ సింగర్ ఇండియాను జోడించారు. ఇది కాకుండా, రేఖ మరో ఐదు స్టాక్‌లలో తన వాటాలను పెంచుకున్నారు. వాటిలో మూడు టాటా గ్రూప్ సంస్థలు ఉన్నాయి. సెప్టెంబర్ 2022 త్రైమాసికం ముగిసే సమయానికి, రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో నికర విలువ రూ.25,425.88 కోట్లుగా ఉంది.

టాటా కమ్యూనికేషన్స్
రేఖా జున్‌జున్‌వాలా సెప్టెంబర్ 30, 2022 నాటికి సింగర్ ఇండియాలో 42,50,000 ఈక్విటీ షేర్లను అంటే 7.91% కొనుగోలు చేశారు. సింగర్ ఇండియా షేర్ల ధర దాదాపు సోమవారం రూ.70గా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ.374.94 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ కుట్టు ఉత్పత్తులు, గృహోపకరణాలు తయారుచేస్తుంది. రేఖ డిసెంబర్ 2020 నుంచి టాటా కమ్యూనికేషన్స్‌లో పెట్టుబడిదారుగా ఉన్నారు. తాజాగా ఆమె తన షేర్‌హోల్డింగ్‌ను 0.53% పెంచారు. దీంతో ఆమె వాటా కంపెనీలో 1.61%కి చేరింది.

టైటాన్ కంపెనీ
ఈ టాటా స్టాక్ జున్‌జున్‌వాలాస్ పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద సంపద సృష్టికర్తగా ఉంది. రాకేష్ భార్య రేఖా ఝున్‌జున్‌వాలా టైటాన్‌లో వాటాను 1.69% కి పెంచుకున్నారు. గతంలో ఆమె వాట్ 1.07% గా ఉండేది. టైటాన్‌లో రాకేష్ హోల్డింగ్ Q2FY23లో దాదాపు 3.85% ఉంది. రాకేష్, రేఖ దంపతులు టైటాన్‌లో 49,200,970 ఈక్విటీ షేర్లు లేదా 5.5% వాటా కలిగి ఉన్నారు. జూన్ 2022 త్రైమాసికం చివరి నాటికి ఈ జంట హోల్డింగ్ దాదాపు 5.1%గాఉంది.

ఫోర్టిస్ హెల్త్‌కేర్
రేఖ మొదట సెప్టెంబర్ 2017 త్రైమాసికంలో ఫోర్టిస్‌లో పెట్టుబడి పెట్టారు. అయితే డిసెంబర్ 2020 త్రైమాసికంలో తన షేర్లన్నింటినీ విక్రయించారు. Q2FY23లో ఆమె మరోసారి ఫోర్టిస్‌ని తన పోర్ట్‌ఫోలియోకు చేర్చుకున్నారు. సెప్టెంబర్ 30, 2022 నాటికి, రేఖ షేర్‌హోల్డింగ్ 1.22 శాతంగా ఉంది. మరోవైపు, ఫోర్టిస్‌లో రాకేష్ షేర్ హోల్డింగ్ 4.23% నుంచి 3.44%కి తగ్గింది. ఝున్ ఝున్ వాల దంపతులు ఫోర్టిస్ లో 4.66% వాటా కలిగి ఉన్నారు.

టాటా మోటార్స్
దివంగత రాకేష్ సెప్టెంబర్ 2020 త్రైమాసికంలో టాటా మోటార్స్‌ను తన పోర్ట్‌ఫోలియోకు చేర్చుకున్నారు. తాజాగా ఆయన భార్య రేఖ టాటా మోటార్స్‌లో వాటాను 1.11%కి పెంచుకున్నారు. గత వారం శుక్రవారం బీఎస్‌ఈలో టాటా మోటార్స్ షేర్లు 2.19% పెరిగి 425.35 వద్ద ముగిశాయి. దీని మార్కెట్ క్యాప్ సుమారు రూ.1,41,270 కోట్లుగాఉంది. టాటా మోటర్స్ క్యూ2 ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications