Rekha Jhunjhunwala: దివంగత రాకేష్ జున్‌జున్‌వాలాను అనేక మంది ఇన్వెస్టర్లు ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఆయన లేని లోటును సతీమణి రేఖా జున్‌జున్‌వాలా తీరుస్తున్నారు.
తాజాగా రేఖ జున్‌జున్‌వాలా ఇన్వెస్ట్మెంట్స్ కలిగి ఉన్న కంపెనీ మార్కెట్ ర్యాలీలో పెరుగుదలను నమోదు చేసింది. వారు అమితం ఇష్టపడే టాటా గ్రూప్ స్టాక్ టైటాన్ మల్టీబ్యాగర్ అని మనందరికీ తెలిసిందే. ఈ స్టాక్ శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 3 శాతానికి పైగా లాభపడి రూ.3211.10 స్థాయికి చేరుకుంది. ఇది కంపెనీ కొత్త 52 వారాల గరిష్ఠ ధర. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.105.40 మేర పెరిగింది.

ఒక విధంగా చెప్పాలంటే రాకేష్ జున్‌జున్‌వాలా దశ మార్చిన కంపెనీల్లో టైటాన్ ఒకటి కావటం విశేషం. దీని నుంచి జున్‌జున్‌వాలా ఫ్యామిలీ బాగా లాభపడింది. ప్రస్తుతం రేఖా జున్‌జున్‌వాలా కంపెనీలో 5.29 శాతం ఈక్విటీ కలిగి ఉన్నారు. ఇది 4.69 కోట్ల షేర్లకు సమానం. షేర్ ధర రూ.105 మేర పెరగటంతో ఒక్క రోజులోనే బిగ్ బుల్ భార్య రూ.495 కోట్లను ఆర్జించారు.
అసలు టైటాన్ స్టాక్ అామాంతం పెరుగుదల నమోదు చేయటానికి అసలు కారణం నిన్న కంపెనీ విడుదల చేసిన నూతన ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసిక ఫలితాలే. FY24 క్యూ-1లో కంపెనీ ఆదాయం 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆభరణాల విభాగం 21% వృద్ధిని నమోదు చేయగా.. వాచీలు అండ్ వేరబుల్స్ విభాగం 13%, ఐకేర్ విభాగం అమ్మకాల 10%, పెర్ఫ్యూమ్స్ అండ్ ఫ్యాషన్ విభాగం 11 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. దీంతో కంపెనీ షేర్లలో ఒక్కసారిగా బూమ్ నెలకొంది.
టైటాన్ స్టాక్ గడచిన ఏడాది కాలంలో ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది. జూలై 7, 2022న BSEలో రూ.2128 వద్ద టైటాన్ కంపెనీ షేర్లు.. నేడు కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.3211.10ని తాకింది. 2023లో టైటాన్ షేర్లు 25 శాతం మేర లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications