Rekha Jhunjhunwala: దేశంలో ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మరణం తర్వాత మార్కెట్లలో రిటైలర్లు ఆయన భార్య రేఖా పోర్ట్ ఫోలియోను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రస్తుతం ఆమె నమోదు చేసిన లాభాలపైనే ఉంది.
టాటా గ్రూప్ కంపెనీ టైటాన్ షేర్లు పెరగడంతో రేఖా జున్‌జున్‌వాలా బాగా లాభపడ్డారు. టైటాన్ షేర్లు పెరగడంతో రేఖా సంపద ఒక్క నెలలోనే ఏకంగా రూ.1,380 కోట్లు మేర పెరిగింది. దివంగత రాఖేష్ జున్‌జున్‌వాలాకు ఈ కంపెనీతో ఉన్న అనుబంధం గురించి ఇన్వెస్టర్లకు తెలిసిందే. ఈ క్రమంలో గురువారం టైనాన్ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.3,299.70ను తాకాయి. టైటాన్ స్టాక్ పెరుగుదల కారణంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్‌ఐసీ కూడా భారీగా లాభాన్ని పొందింది.

ఆగస్టు 14న బీఎస్ఈలో టైటాన్ స్టాక్ ధర రూ.3,009.75 వద్ద ఉండగా.. ప్రస్తుతం సెప్టెంబర్ 14న అది రూ.3,299.70 స్థాయికి చేరుకుంది. అంటే ఒక్కో షేరుపై రూ.290 లాభం వచ్చింది. జూన్ త్రైమాసికం డేటా ప్రకారం రేఖా జున్‌జున్‌వాలా టైటాన్‌లో 4,75,95,970 షేర్లను కలిగి ఉన్నారు. ఈ లెక్కన తాజాగా షేర్ ధర లాభపడటం వల్ల ఆమె సంపద రూ.1,380 కోట్ల మేర పెరిగింది.
టాటా గ్రూప్ కంపెనీ టైటాన్ స్టాక్ ర్యాలీ కారణంగా ఎల్‌ఐసీకి కూడా నెల రోజుల్లో రూ.450 కోట్ల మేర తన పెట్టుబడి నుంచి లాభాన్ని ఆర్జించింది. జూన్ 2023 త్రైమాసికం వరకు ఉన్న డేటా ప్రకారం.. టైటాన్ కంపెనీలో ఎల్ఐసీ 1,56,86,771 షేర్లను కలిగి ఉంది. ఈ లెక్కన ఒక్కో షేరుపై రూ.290 లాభం చొప్పున రూ.454 కోట్ల సంపద పెరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications