Rekha Jhunjhunwala: గరిష్ఠాలకు జున్‌జున్‌వాలా పోర్ట్ ఫోలియో స్టాక్.. ఇంకా కొనొచ్చా..?

Rekha Jhunjhunwala: దేశంలోని దివంగత ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ భౌతికంగా మనముందు లేనప్పటికీ ఆయన మార్గదర్శకంలో చాలా మంది ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా పోర్ట్ ఫోలియోను అనుకరించి మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు.

రాకేష్ జున్‌జున్‌వాలా..

రాకేష్ జున్‌జున్‌వాలా..

ఇప్పటికీ చాలా పెట్టుబడులు రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్ ఫోలియోలో కేంద్రీకృతమై ఉన్నాయి. వీటిపై రిటైల్ ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ నేడు రూ.135 వద్ద ట్రేడవుతూ 52 వారాల గరిష్ఠాలకు చేరువలో ఉంది. చివరగా ఈ స్టాక్ జనవరిలో గరిష్ఠమైన రూ.143 మార్కును తాకింది. అయితే ఈసారి స్టాక్ గత రికార్డును అధిగమిస్తుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

టార్గెట్ ధర ఎంతంటే..

టార్గెట్ ధర ఎంతంటే..

భవిష్యత్తులో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ రూ.180 టార్గెట్‌ను చేరుకుంటుందని వారు చెబుతున్నారు. బ్యాంక్ రాబోయే సంవత్సరాల్లో దాని వృద్ధి రేటును పెంచుతుందని బ్రోకరేజీలు భావిస్తున్నాయి. ఇటీవల బ్యాంక్ క్రెడిట్ వృద్ధి పెరుగుతూనే ఉంది. FY22-25Eలో బ్యాంక్ EPS CAGR రేటు 28% కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా. ఇది స్టాక్ ధర పెరుగుదలలో ప్రతిబింబిస్తుందని తెలుస్తోంది.

బ్యాంకింగ్ రంగంలో..

బ్యాంకింగ్ రంగంలో..

బ్యాంకింగ్ రంగానికి చెందిన ఈ మిడ్‌క్యాప్ బ్యాంక్ స్థిరంగా మిగులును నమోదు చేసింది. ఇది సానుకూల అంశంగా పరిగణించబడుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడుతుండటం వల్ల వృద్ధిపై కూడా ప్రభావం పడుతుందని అంచనా. ఈ కారణంగా వడ్డీ ఆదాయం కూడా పెరుగుతుందని తెలుస్తోంది. పైగా బ్యాంకులో ఎన్నారై డిపాజిట్ల నిష్పత్తి కూడా పెరగటం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి.

రేఖా జున్‌జున్‌వాలా..

రేఖా జున్‌జున్‌వాలా..

బీఎస్ఈలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఫెడరల్ బ్యాంక్‌లో దివంగత బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా 1.17% వాటాను కలిగి ఉన్నారు. ఇదే సమయంలో ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా డిసెంబర్ 2022 నాటికి 2.31% వాటాను కూడా కలిగి ఉన్నారు.

ఇన్వెస్ట్ చేయెుచ్చా..? వద్దా..?

ఇన్వెస్ట్ చేయెుచ్చా..? వద్దా..?

ఎన్ఎస్ఈలో స్టాక్ ధర ఈరోజు ఉదంయ 11.28 గంటల సమయంలో 134.45 వద్ద్ ట్రేడ్ అవుతోంది. ఇదే క్రమంలో బీఎస్ఈలో చూసినట్లయితే 134.40 వద్ద ఉంది. బ్రోకరేజ్ సంస్థల అంచనాల ప్రకారం రానున్న కాలంలో స్టాక్ మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు ఇదొక చక్కటి అవకాశంగా తెలుస్తోంది. మంచి పెట్టుబడి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు ఇదొక పరిగణలోకి తీసుకోదగిన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇటీవల దేశంలోని బ్యాంకింగ్ రంగం మంచి పనితీరుతో దూసుకుపోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకింగ్ స్టాక్స్ దీనినే ప్రతిబింబిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+