IKS Limited IPO: భారతీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోలు వస్తుంటాయ్ పోతుంటాయ్. కానీ కొన్నింటికి బ్రాండ్ ఉంటది సార్ బ్రాండ్. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ బిగ్ బుల్, దివంగత ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాకేష్ జున్‍జున్‍వాలా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న కంపెనీ ఒకటి మార్కెట్లోకి తన ఐపీవోను ఫ్లోట్ చేస్తోంది. దీంతో చిన్న ఇన్వెస్టర్ల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకు అందరి చూపు ఈ కంపెనీ ఐపీవోపైనే కొనసాగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,497.92 కోట్లను సమీకరించాలని లక్ష్యంతో వస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద వస్తున్న ఐపీవో. తాజా ఐపీవో కింద కంపెనీ 1.88 కోట్ల ఈక్విటీ షేర్లు ఓఎఫ్ఎస్ సేల్ కోసం ఉంచింది. సాధారణ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో లిస్టింగ్ డిసెంబర్ 19న జరగనుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో కంపెనీ నేడు తన ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.1265-1329 మధ్య ప్రకటించింది. అలాగే కనీస పెట్టుబడి కోసం లాట్ పరిమాణాన్ని 11 షేర్లుగా ఉంచింది. దీనివల్ల రిటైల్ పెట్టుబడిదారులు ఐపీవోలో పాల్గొనటానికి కనీసం రూ.14,619 పెట్టుబడిగా పెట్టాల్సి వస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీకి 10 శాతం, నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం కేటాయించగా, మిగిలిన వాటాలను క్వాలిఫైడ్ ఇన్టిట్యూషనల్ బయ్యర్స్ కోసం రిజర్వు చేసింది. ఇక కంపెనీ ప్రమోటర్ల విషయానికి వస్తే.. సచిన్ గుప్తా, రేఖా జున్‍జున్‍వాలా, ఆర్యమాన్ జున్‍జున్‍వాలా ట్రస్ట్, ఆర్యవీర్ జున్‍జున్‍వాలా ట్రస్ట్, నిష్ఠా జున్‍జున్‍వాలా ట్రస్ట్ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు.
గ్రేమార్కెట్లో దూకుడు..
కంపెనీ షేర్లు ఒక్కోటి గ్రేమార్కెట్లో రూ.225 ప్రీమియం ధర పలుకుతోంది. దీంతో లిస్టింగ్ రోజున ఐపీవో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు 16 శాతం రాబడిని అందించవచ్చని ప్రస్తుతం గ్రేమార్కెట్ చూసిన మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,857.94 కోట్లుగా నమోదు కాగా.. నికర లాభం రూ.370.49 కోట్లగా నమోదైంది.
2006లో స్థాపించబడిన కంపెనీ హెల్త్ కేర్ రంగంలోని సంస్థలకు అడ్మినిస్ట్రేషన్ వర్క్ నిర్వహణ సేవలను అందిస్తోంది. కంపెనీ వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు వారి వ్రాతపని, పరిపాలనా పనులను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. IKS హెల్త్ క్లినికల్ సపోర్ట్, మెడికల్ డాక్యుమెంటేషన్ మేనేజ్‌మెంట్, వర్చువల్ మెడికల్ స్క్రైబింగ్ వంటి సేవలను అందిస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications