Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
KM Sugar Mills: దాదాపుగా 5 రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అయితే ఇలాంటి బలహీనమైన మార్కెట్లలో సైతం రేఖా జున్‌జున్‌వాలా డబ్బు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మాత్రం ఎదురీదుతూ 15 శాతం మేర లాభపడింది.
అస్థిర మార్కెట్‌లో చక్కెర కంపెనీ కేఎం షుగర్ మిల్స్ షేర్లు భారీగా పెరిగాయి. కేఎం షుగర్ మిల్స్ షేర్లు నేడు ఇంట్రాడేలో 15 శాతానికి పైగా లాభపడి రూ.41.49 స్థాయికి చేరాయి. దీంతో కంపెనీ షేర్లు ఏకంగా 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా జున్‌జున్‌వాలా చక్కెర కంపెనీపై భారీ పందెం వేశారు. మార్చి త్రైమాసికంలో జున్‌జున్‌వాలా తన పోర్ట్‌ఫోలియోకు 5 లక్షల KM షుగర్ మిల్స్ షేర్లను జోడించారు.

KM షుగర్ మిల్స్ లిమిటెడ్ షేర్లు గడచిన 4 ఏళ్లలో వేగంగా పెరిగాయి. ఈ కాలంలో స్టాక్ తన ఇన్వెస్టర్లకు ఏకంగా 490 శాతం రాబడిని అందించింది. ఏప్రిల్ 24, 2020న కంపెనీ షేర్ ఒక్కోటి రూ.6.80 ధర వద్ద ఉన్నాయి. అయితే ఏప్రిల్ 19, 2024న ఒక్కో షేరు ధర అత్యధికంగా రూ.41.49 స్థాయికి చేరుకోవటంతో ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ రాబడులను అందుకున్నారు. అలాగే గత నెలలో కంపెనీ షేర్లు 40 శాతం మేర పెరిగాయి. KM షుగర్ మిల్స్ షేర్లు మార్చి 19, 2024న రూ.29.40 వద్ద ఉండగా.. ఏప్రిల్ 19, 2024న కంపెనీ షేర్లు రూ.41.49కి చేరుకున్నాయి.
మార్చి 2024 త్రైమాసికంలో రేఖా జున్‌జున్‌వాలా ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 44.28 లక్షల షేర్లను విక్రయించినట్లు వెల్లడైంది. ఇప్పుడు కంపెనీలో ఆమె వాటా 4.66 శాతం నుంచి 4.07 శాతానికి తగ్గింది. ఇదే క్రమంలో జున్‌జున్‌వాలా టాటా కమ్యూనికేషన్స్‌లో తన వాటాను కూడా తగ్గించుకున్నారు. రేఖా జున్‌జున్‌వాలా మార్చి 2024 త్రైమాసికంలో టాటా కమ్యూనికేషన్స్‌లో 7.34 లక్షల షేర్లను విక్రయించగా ప్రస్తుతం కంపెనీలో 1.58% వాటాను మాత్రమే కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications