F&O Trading: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల కోసం ట్రేడర్లు చేస్తున్న కొనుగోళ్లు ఒకపక్క కొనసాగుతుండగా.. మరో పక్క చాలా మంది ఇన్వెస్టర్లు ముందస్తు జాగ్రత్తలో భాగంగా పెట్టుబడుల అమ్మకాలకు దిగుతున్నారు.
మరో పక్క నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదనను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తిరస్కరించింది. వాస్తవానికి బ్రోకింగ్ కమ్యూనిటీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ గంటలను పొడిగించాలన్న ఎన్‌ఎస్‌ఈ ప్రతిపాదనను స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) తాజాగా తిరస్కరించింది. వాస్తవానికి ఎన్ఎస్ఈ ప్రతిపాదనను పరిశీలిస్తే.. F&O కోసం ట్రేడింగ్ గంటలను క్రమంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పొడిగించాలని సెబీని కోరింది.

ట్రేడింగ్ గంటలను పొడిగించడం అనేది మార్కెట్ పార్టిసిపెంట్‌లు సాయంత్రం వేళలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తలపై చర్య తీసుకోవడానికి దశలవారీ ప్రణాళికలో భాగంగా ఉంది. రెండవ దశలో ట్రేడింగ్‌ను రాత్రి 11:30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. చివరిగా మూడో దశలో కరెన్సీ మార్కెట్‌లో ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని సెబీకి ప్రతిపాదించారు. అదనపు ఖర్చులు, సాంకేతిక అవసరాల కారణంగా ట్రేడింగ్ గంటలను పొడిగించడానికి బ్రోకింగ్ సంఘం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఏడాది ప్రారంభంలో స్టాక్ బ్రోకర్స్ బాడీ అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా ప్రణాళికను ఆమోదించింది.
తమ ప్రతిపాదన సెబీ వద్ద తిరస్కరణకు గురైందని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ ఎన్ఎస్ఈ నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి వాయిదా వేయబడినట్లు పేర్కొన్నారు. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో NSE నికర లాభం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఏకంగా 55 శాతం వృద్ధి చెందింది. ఇదే కాలంలో ఆదాయం రూ.4,625 కోట్లు పెరిగింది. దీంతో తన ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ ఒక్కో షేరుపై నాలుగు బోనస్ షేర్లతో పాటు మెుత్తంగా రూ.90 డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఎన్ఎస్ఈ ప్రతిపాదన సెబీ వద్ద తిరస్కరణకు గురైనట్లు వెల్లడికావటంతో స్టాక్ మార్కెట్లు క్షీణతకు గురయ్యాయి. దీనికి తోడు అనేక ఇతర కారణాలు సైతం మార్కెట్ల పతనాన్ని నడిపించాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications