గతేడాది అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ కంపెనీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. తాజాగా హిండెన్ బర్గ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. "సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా" అని శనివారం హిండెన్ బర్గ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో హిండెన్ బర్గ్ తదుపరి లక్ష్యం ఏ కార్పొరేషన్ కావచ్చు అనే దానిపై విస్తృతమైన ఊహాగానాలు కొనసాగుతోన్నాయి. గత సంవత్సరం జనవరిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రణాళికాబద్ధమైన వాటా విక్రయం ప్రారంభించింది.
అదే సమయంలో హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ పై పలు ఆరోపణలు చేస్తూ నివేదికను విడుదల చేసింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్‌లలో భారీ క్షీణత నమోదయింది. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో సుమారు $86 బిలియన్లను తుడిచిపెట్టుకుపోయాయి. కొన్ని రోజుల తర్వాత అంటే జూన్‌లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కు నోటిసులు జారీ చేసింది. దీనిపై హిండెన్‌బర్గ్ స్పందిస్తూ సెబీ వారు భారతీయ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ నోటీసు జారీ చేసిందని .. ఇది "నాన్సెన్స్" అని కొట్టిపారేసింది.

భారతదేశంలోని శక్తివంతమైన వ్యక్తుల అవినీతి, మోసాలను బహిర్గతం చేసే వారిని నిశ్శబ్దం చేయడం, భయపెట్టడం అనే "ముందస్తు నిర్దేశిత ప్రయోజనం" కోసం ఈ నోటీసు కల్పితమని వారు వాదించారు. హిండెన్‌బర్గ్ మొదటిసారిగా తన నివేదికలో కోటక్ బ్యాంక్ పేరును స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ వివాదంలోకి కోటక్ మహీంద్ర బ్యాంక్ వచ్చింది. నాథన్ ఆండర్సన్ ద్వారా 2017లో స్థాపించబడిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివరణాత్మక పరిశోధనలు నిర్వహించిన తర్వాత ప్రధాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని పలు నివేదికలు విడుదల చేసింది.
ఈ సంస్థ దాదాపు 10 మంది ఉద్యోగులతో, సంస్థ కార్పొరేట్ "గోలియత్స్"ని తీసుకుని షార్ట్ సెల్లింగ్ "డేవిడ్"గా పేరు తెచ్చుకుంది. భారతీయ స్టాక్ మార్కెట్లు పీక్ లో ఉన్న సమయంలో ఇండెన్ బర్గ్ సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా అని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications