కరోనా మహమ్మారి ప్రభావాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల బలోపేతానికి ఉపకరిస్తాయని, తద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన ఆర్థికవృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. విధానపరమైన వాతావరణానికి తోడు భాగస్వాములు అందరు కలిసి తీసుకున్న చర్యలు, అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుకల్పిస్తుందని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ఇనుమడింప చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ తన నెలవారీ ఆర్థిక నివేదికలో తెలిపింది.

ఎన్నో సంస్కరణలు
కరోనా వల్ల వ్యవసాయ మార్కెట్లు, కార్మిక చట్టాలు, ఎంఎస్ఎంఈల నిర్వచనం వంటి వివిధ రంగాల్లో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు దీర్ఘకాలికంగా మేలు చేసేవని ఆర్థికమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్కరణలతో ఎంఎస్‌ఎంఈ రంగానికి మరింత మేలు జరుగుతుందని వెల్లడించింది. వివిధ సంస్కరణలు వృద్ధికి దోహదపడి, వివిధ రంగాల్లో ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని తెలిపింది. ఐఎంఎఫ్ 1991లో తీసుకున్న రుణ షరతులపై మూడు దశాబ్దాలుగా చర్చ జరిగిందని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని, ఇవి ఉపాధి, ఉద్యోగ అవకాశాల పెంచేందుకు ఉపకరిస్తాయన్నారు. ఈ రంగాల్లో కార్మికుల వేతనాలతో పాటు ఉపాధి అవకాశాలు, ఉత్పాదకత పెరుగుతాయని అంచనా వేసింది. దీర్ఘకాలంలో నిలకడతో కూడిన అధిక జీడీపీ వృద్ధి రేటు సాధనకు ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని పేర్కొంది.

దీర్ఘకాలంలో మేలు చేసేవి
బారత్‌కు కరోనా మహమ్మారి ముప్పు ఇప్పటికీ పూర్తిగా తొలగకపోయినప్పటికీ క్రమంగా గాడినపడే అవకాశం ఉందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా విస్తరిస్తూ ఉండటం స్వల్పకాలం నుండి మధ్యకాలానికి వృద్ధి రేటుకు ప్రతికూలంగా మారుతుందని, అయితే ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు దీనిని అధిగమించేలా చేస్తాయని, దీర్ఘకాలంలో ఎంతో మేలు చేసేవి అని తెలిపింది. వ్యవసాయ రంగంలో తాజాగా చేపట్టిన సంస్కరణలు ఎప్పుడో సాకారం కావాల్సినవిగా అభిప్రాయపడింది. సెప్టెంబర్ 17వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య 14 రోజుల కాలంలో దేశంలో కరోనా కేసులు గరిష్టానికి చేరినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. కేసుల సంఖ్య క్రమంగా 93,000 నుండి 83,000కు క్షీణించిందని, అలాగే రోజువారీ పరీక్షల సంఖ్య 1,15,000 నుండి 1,24,000 పెరిగిందని పేర్కొంది.

అవకాశాలను సద్వినియోగం చేసుకొని..
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఆర్థిక వ్యవస్థ క్రమంగా తెరుచుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడం దేశ ఆర్థిక రికవరీకి తోడ్పడ్డాయని నివేదికలో తెలిపింది. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విధానవాతావరణం, అన్నిరంగాల పెరుగుతున్న కార్యకలాపాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపింది. సెప్టెంబర్ 25తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 542.02 బిలియన్ డాలర్లకు పెరిగాయని తెలిపింది. భారత పెట్టుబడి గ్రేడ్ నిలుపుకుందని, 2021 నుండి కోలుకుంటుందని తెలిపింది. ఇవి భారత వృద్ధికి మార్గంలా కనిపిస్తున్నాయని తెలిపింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications