For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోడీ ఏమన్నారంటే

|

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సరికొత్త సవాళ్లను విసిరింది. ఇందుకు భారత్ మినహాయింపు కాదు. సుస్థిరత భరోసా కల్పిస్తూ ప్రజా సంక్షేమం కోసం తగినంత వనరులను సేకరించడం అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని ప్రధాని నరేంద్ర మోడీ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలు గణనీయంగా రుణాలు పొందినట్లు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు అదనంగా రూ.1.66 లక్షల కోట్ల అదనపు రుణాలు పొందినట్లు చెప్పారు. కేంద్ర-రాష్ట్ర భగీదారి విధానం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపారు.

Reforms by conviction and incentives says PM Modi in blog post

ఫెడరల్ విధానంపై తమకు నమ్మకం ఉందని, అందుకే కేంద్రం-రాష్ట్రం భగీధారి స్ఫూర్తితో ముందుకు సాగినట్లు తెలిపారు. మే 2020లో ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చామని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ప్రతి సంస్కరణ ప్రజలకు ముఖ్యంగా పేదలకు, బలహీన వర్గాల కోసం అనుసంధానించబడ్డాయని, అలాగే, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించినట్లు తెలిపారు.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సంస్కరణ ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులు, అందరు కుటుంబ సభ్యుల ఆధార్ సంఖ్యతో సీడ్ అయ్యేలా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడి నుండి అయినా రేషన్‌ను తీసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

English summary

సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోడీ ఏమన్నారంటే | Reforms by conviction and incentives says PM Modi in blog post

The Covid-19 pandemic has come with whole new set of challenges to Governments across the world in terms of policy-making. India is no exception. Raising enough resources for public welfare while ensuring sustainability is proving to be one of the biggest challenges, Prime Minister Narendra Modi said in a blog post.
Story first published: Tuesday, June 22, 2021, 18:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X