భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 'నోట్' సిరీస్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ, షావోమి సబ్-బ్రాండ్ రెడ్‌మీ తన సరికొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్ ను దించింది. రెడ్ మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) , ప్రో ప్లస్ మోడళ్లను జనవరి 29, 2026న గ్రాండ్ గా లాంచ్ చేసింది. అదిరిపోయే డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్లు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
Redmi Note 15 ప్రో సిరీస్: ఫీచర్లు , స్పెసిఫికేషన్లు
ఈ సిరీస్‌లో Redmi Note 15 ప్రో , ప్రో ప్లస్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. రెండింటిలోనూ 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ ప్లే ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కూడా ఉంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రో ప్లస్ మోడల్‌లో 'స్నాప్‌డ్రాగన్ 7s Gen 4' చిప్‌సెట్ ఉండగా, ప్రో మోడల్‌లో 'మీడియాటెక్ డైమెన్సిటీ 7400- అల్ట్రా' ప్రాసెసర్ ను వాడారు. ఇవి రెండూ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2 (HyperOS 2) పై పనిచేస్తాయి.
ఇక కెమెరా విభాగంలో వీటి పెర్ఫామెన్స్ అదుర్స్! రెండింటిలోనూ 200MP మెయిన్ కెమెరా (OIS తో) , 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ప్రో ప్లస్‌లో 32MP, ప్రోలో 20MP కెమెరాలు ఉన్నాయి.

ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ప్రో ప్లస్ లో 5,500 mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ప్రో మోడల్‌లో భారీగా 6,580 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఇది 45W ఛార్జింగ్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. విశేషమేమిటంటే, ఈ ఫోన్లకు IP69K రేటింగ్ ఉంది. అంటే నీరు , ధూళి నుంచి వీటికి కొంత వరకూ రక్షణ లభిస్తుంది.
శాంసంగ్, వివో మార్కెట్ ఆధిపత్యానికి సవాల్ విసరగలవా?
ప్రస్తుతం భారత మార్కెట్లో శాంసంగ్ (Samsung) తన డిజైన్ , బ్రాండ్ వాల్యూతో, వివో (Vivo) తన కెమెరా ఫీచర్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే రెడ్ మీ.. తన Redmi Note 15 ప్రో సిరీస్ తో ఈ రెండు బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రూ. 30,000 - రూ. 40,000 బడ్జెట్ విభాగంలో 200MP కెమెరా , 1.5K AMOLED డిస్ప్లేను అందించడం ద్వారా రెడ్‌మీ తన పట్టును నిరూపించుకుంది.
శాంసంగ్ తన ఏ-సిరీస్ (A-series) ఫోన్లలో కెమెరా నాణ్యతను పెంచుతున్నప్పటికీ, రెడ్‌మీ ఇచ్చే ఛార్జింగ్ స్పీడ్ , ప్రాసెసర్ పవర్ ముందు అవి వెనుకబడి ఉన్నాయి. అలాగే వివో ఫోన్లు డిజైన్ పరంగా బాగున్నా, రెడ్‌మీ ఇచ్చే 'డ్యూరబిలిటీ' (IP69 రేటింగ్) , సాఫ్ట్‌వేర్ కస్టమైజేషన్ వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ ధరలో బ్యాంక్ ఆఫర్లతో కలిపి లభించే డిస్కౌంట్లు రెడ్‌మీకి పెద్ద ప్లస్ పాయింట్.
ధరల వివరాలు
• Redmi Note 15 Pro 5G: ప్రారంభ ధర రూ. 29,999 (8GB/128GB). బ్యాంక్ ఆఫర్లతో రూ. 26,999 కే లభిస్తుంది.
• Redmi Note 15 Pro+ 5G: ప్రారంభ ధర రూ. 37,999 (8GB/256GB). ఆఫర్లతో రూ. 34,999 కే పొందవచ్చు.
మొత్తంగా చూస్తే.. ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరలో అందిచడంలో రెడ్ మీ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ఒకవేళ మీరు రూ.30 వేల బడ్జెట్ లో మిడ్ రేంజ్ మొబైల్ కోసం చూస్తుంటే.. Redmi Note 15 ప్రో సిరీస్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications