SIP ఆపేయాలనుకుంటున్నారా? ఈ సక్సెస్ స్టోరీ చదివితే మీ నిర్ణయం మార్చుకుంటారు!
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను చూసి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భయపడిపోతున్నారు. మార్కెట్ పడిపోతున్నప్పుడు తమ SIP (Systematic Investment Plan) ఆపేయాలా లేదా తాత్కాలికంగా నిలిపివేయాలా? అని ఆలోచిస్తుంటారు. కానీ, తాజాగా 'రెడ్డిట్' (Reddit) లో వైరల్ అవుతున్న ఒక ఇన్వెస్టర్ అనుభవం చూస్తే, మార్కెట్ టైమింగ్ కంటే ఓపిక (Patience) ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. కేవలం క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ద్వారా ఒక సాధారణ వ్యక్తి 15 ఏళ్లలో తన చిన్న మొత్తాన్ని ఏకంగా రూ. 2.10 కోట్ల భారీ నిధిగా మార్చుకున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పదిహేనేళ్ల ప్రయాణం.. రూ. 2 కోట్ల లాభం!
సదరు ఇన్వెస్టర్ పంచుకున్న వివరాల ప్రకారం.. ఆయన 15 ఏళ్ల క్రితం పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించారు. తన మొత్తం పెట్టుబడి కాలంలో ఆయన ఇన్వెస్ట్ చేసిన అసలు మొత్తం కేవలం రూ. 51,420 మాత్రమే (కొన్ని వన్-టైమ్ , రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ కలిపి). కానీ, కాంపౌండింగ్ శక్తి వల్ల నేడు దాని విలువ రూ. 2.10 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు వార్షికంగా 17.1 శాతం రిటర్న్స్‌ను ఆ ఇన్వెస్టర్ అందుకున్నారు. ఇది ఎదో అదృష్టమో లేక రాత్రికి రాత్రే వచ్చిన లాభమో కాదు, 15 ఏళ్ల పాటు మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటం వల్ల వచ్చిన ఫలితం.
మార్కెట్ పడిపోయినప్పుడే అసలైన అవకాశం
చాలా మంది మార్కెట్ పడిపోతున్నప్పుడు భయపడి SIP ఆపేస్తుంటారు. కానీ, రెడ్డిట్ యూజర్ చెప్పిన దాని ప్రకారం.. "మార్కెట్ పడిపోయినప్పుడు అదే ధరకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. మార్కెట్ పెరిగినప్పుడు మీ ఓపికకు తగిన ప్రతిఫలం లభిస్తుంది." దీనినే 'రూపీ కాస్ట్ యావరేజింగ్' అంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి నెలకు రూ. 10,000 చొప్పున 15 ఏళ్ల పాటు 17.1% రిటర్న్స్‌తో ఇన్వెస్ట్ చేస్తే, అది సుమారు రూ. 74 లక్షలు అవుతుంది. అదే నెలకు రూ. 30,000 చొప్పున పెట్టుబడి పెడితే, 15 ఏళ్ల తర్వాత అది రూ. 2.2 కోట్లకు పైగా మారుతుంది.
విజయానికి సూత్రాలు ఇవే
ఈ సక్సెస్ వెనుక కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయని ఆ ఇన్వెస్టర్ తెలిపారు. కమిషన్లు సేవ్ చేయడానికి 'రెగ్యులర్ ప్లాన్స్' కంటే 'డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్'ను ఎంచుకోవడం, తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్‌ను వెతకడం, , కేవలం అవసరానికి మించి ఉన్న మిగులు ధనాన్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయడం ఇందులో కీలకం. అన్నిటికంటే ముఖ్యంగా, పోర్ట్‌ఫోలియో నష్టాల్లో ఉన్నప్పుడు కంగారు పడి నిర్ణయాలు తీసుకోకూడదు. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, పడినా మళ్ళీ బలంగా పుంజుకుంటుందనే నమ్మకమే ఈ రోజు ఆయనను కోటీశ్వరుడిని చేసింది. కాబట్టి మీ SIP ని అశ్రద్ధ చేయకండి, కాంపౌండింగ్ మ్యాజిక్ జరగడానికి సమయం ఇవ్వండి.


Click it and Unblock the Notifications