Zepto Latest News: ప్రస్తుతం భారతదేశంలో క్విక్ కామర్స్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కొట్టుకెల్లొస్తే కొనుక్కోవటానికి ఇంట్లో పెద్దోళ్లు పిల్లలకు డబ్బులిచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రజల జీవనశైలి మారిపోవటంతో కొందరు బిజీ షెడ్యూల్ వల్ల షాపింగ్ కి వెళ్లలేకపోతున్నారు. మరికొందరు బద్దకంతో మార్కెట్లోని అనేక క్విక్ కామర్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. అయితే దీనిని సదరు కంపెనీలు ఎలా దుర్వినియోగం చేస్తున్నాయి, ప్రజలను దొరికినకాడికి ఎలా లూటీ చేస్తున్నాయనే విషయం తాజాగా బయటపడింది.
తాజాగా ఒక వ్యక్తి తాను జెప్టోలో ఉద్యోగినని పేర్కొంటూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ రెడిట్‍లో సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో స్టార్టప్ కంపెనీ జెప్టో పెద్ద ఎదురుదెబ్బను చూస్తోంది. ముందుగా జెప్టో ప్లాట్‌ఫారమ్ రూ.30,000 కంటే ఎక్కువ విలువైన మెుబైల్ ఫోన్స్ ఉపయోగించే క్విక్ కామర్స్ కస్టమర్ల నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేస్తుందని, వారు చేసే ఆర్డర్లపై అధిక రేట్లను వసూలు చేస్తుందని బాంబు పేల్చాడు. అలాగే క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ తన అప్లికేషన్‌లో డార్క్ ప్యాటర్న్‌లను ఉపయోగించి కస్టమర్ల నుంచి వివిధ మార్గాల్లో డబ్బును లూటీ చేస్తోందని తన పోస్టులో పేర్కొన్నాడు. అలాగే కంపెనీ వినియోగదారులకు సంబంధించిన డేటా సేఫ్టీ విషయంలో చాలా అద్వాన్నం పద్ధతులను ఉపయోగిస్తోందని ఆరోపించాడు.

అనేక సార్లు జెప్టో యూజర్ల డేటా తస్కరించబడటం లేదా లీక్ కావటం జరిగినప్పటికీ పెట్టుబడిదారుల నుంచి వస్తున్న ప్రెజర్ కారణంగా కంపెనీ ఎక్కువగా గ్రోత్, విస్తరణపైనే ఫోకస్ కొనసాగించిందని సదరు రెడిట్ యూజర్ పేర్కొన్నాడు. ఇదే క్రమంలో డెలివరీ స్టార్టప్ కంపెనీలో టాక్సిక్ వర్క్ కల్చర్ ఉందని కొన్ని ఆరోపణలు సైతం ఇటీవల బయటకు వచ్చాయి. సీనియర్లకు బదులు కంపెనీ యువతను హైర్ చేసుకుంటోందని, వారిని రోజుకు దాదాపు 14 గంటల పాటు పనిచేసేలా చేస్తోందని పోస్టులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే టెక్ టీమ్ లో పనిచేసే వ్యక్తులు రాత్రుళ్లు 1 వరకు మేల్కొనటం కోసం కొన్ని రకాల మందులు కూడా వినియోగిస్తున్నారని అవి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే ఈ వివాదంపై ఎట్టకేలకు డిసెంబర్ 4 ఉదయం జెప్టో సీఈవో అదిత్ పలీచా స్పందిస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే విషయానికి తాను వ్యతిరేకిని కానని పేర్కొన్నాడు. అలాగే తాను తన పోటీదారులకు సైతం దీనిని పాటించాలని సూచిస్తానని ట్వట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. అయితే దీనిపై ఇంటర్నెట్లో భారీగా డిబేట్ కొనసాగుతోంది. ఒక వ్యక్తి తాను కంపెనీలో దాదాపు ఏడాది నుంచి పనిచేస్తున్నానని కంపెనీలో ప్రస్తుతం మోస్ట్ టాక్సిక్ వర్క్ కల్చర్ కొనసాగుతోందని పేర్కొన్నాడు. అలాగే తెల్లవారుజామున 2 గంటలకు ఉద్యోగులతో మీటింగ్స్ పెట్టడంపై కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ఇవన్నీ చూస్తున్న చాలా మంది తమ డేటా ప్రైవసీతో పాటు కంపెనీ కొందరు కస్టమర్ల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయటాన్ని తప్పుపడుతున్నారు. కంపెనీ సీఈవో సైతం తాము ఇలాంటి చర్యలకు పాల్పడటం లేదని క్లారిటీ ఇవ్వకపోవటం కూడా చాలా మందిలో ఆరోపణలు వాస్తవమేనా అనే అనుమానాలను కలిగిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications