ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంచనాతో చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను కొంత మందిని తొలగించాయి. ఐటీ సంస్థలే కాకుండా ఇతర రంగాల్లో కూడా తొలగింపులు కొనసాగుతున్నాయి.
తాజాగా అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసే రెడ్ క్రాస్ సంస్థ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాలని నిర్ణయిం తీసుకుంది. వచ్చే సంవత్సరం నాటికి మొత్తం 1500 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు రెడ్‌క్రాస్ వెల్లడించింది. నిధుల కొరత కారణంగా సంస్థ ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది.

గత కొద్ది కాలంగా రెడ్‌క్రాస్ లేఆఫ్స్ నిధులు కొరత ఎదుర్కొంటుంది. అందుకే ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్స్టిట్యూట్ తన ఖర్చులో కోట్లను తగ్గించుకోవడానికి వచ్చే ఏడాది నాటికి 1500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపింది.
మార్చి 30న జరిగిన బోర్డు సమావేశంలోనే ఈ రిట్రెంచ్‌మెంట్ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు రెడ్‌క్రాస్ వివరించింది. రెడ్‌క్రాస్ ప్రపంచవ్యాప్తంగా 20 ప్రదేశాలలో తన నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ అన్ని నిర్ణయాల ద్వారా రెడ్‌క్రాస్ తన నిధులను ఆదా చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ మాంద్యం కారణంగా రెడ్‌క్రాస్ వంటి సంస్థలకు ఈసారి తక్కువ నిధులు అందుతున్నాయి. అందుకే ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటున్నారు.
రెడ్‌క్రాస్ సంస్థ యుద్ధం లేదా విపత్తు-ప్రభావిత ప్రాంతాలలో ఉన్న ప్రజలకు మానవతా సహాయం అందించే అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్ కాకుండా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ మెటా వంటి అనేక పెద్ద టెక్ కంపెనీలు అనేక దఫా ధపాలుగా ఉద్యోగులను తొలగించాయి.


Click it and Unblock the Notifications