గత అరవై ఏళ్లలో తొలిసారిగా చైనా జనాభాలో తగ్గుదల నమోదైనట్లు ఆ దేశ జాతీయ గణాంకాల సంస్థ తెలిపింది. 1961లో అక్కడ సంభవించిన భారీ కరువు తరువాత జనాభా తగ్గడం గతేడాదే తొలిసారి కావడం విశేషం. తద్వారా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ ఈ ఏడాదిలోనే అవతరించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం:
గతేడాది చివరి నాటికి చైనా జనాభా దాదాపు 8.5 లక్షలు తగ్గి 1.41175 బిలియన్లకు చేరుకున్నట్లు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఈ క్షీణత దీర్ఘకాలం కొనసాగుతుందని.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2021లో ప్రతి 1,000 మందికి జనాభాకు 7.52గా ఉన్న జననాల రేటు.. 2022లో 6.77కు పడిపోయింది. తద్వారా అత్యంత తక్కువ జనన రేటుతో గతేడాది కొత్త రికార్డు నెలకొంది.

మరణాల్లోనూ అత్యధికం:
1974 నుంచి చూస్తే మరణాల్లోనూ అత్యధిక రేటు గతేడాదే నమోదైనట్లు చైనా వెల్లడించింది. 2021లో 1,000 మందికి 7.18 మరణాల రేటుతో పోలిస్తే 2022కి 7.37 కి పెరిగింది. 2050 నాటికి ఆ దేశ జనాభా 109 మిలియన్లకు తగ్గిపోతుందని ఐక్యరాజ్యసమితి నిపుణులు చెబుతున్నారు. 2019లో వారి అంచనాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

కలలు కల్లలేనా ?
ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే చైనా కలకు ఈ నివేదిక గండి కొడుతున్నట్లు కనిపిస్తోంది. పౌరుల్లో అధికులు సీనియర్ సిటిజన్లు కాగా.. ఆదాయాలు తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. వారి సంరక్షణకు సైతం ప్రభుత్వ అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తద్వారా రుణాలూ పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 1980-2015 కాలంలో చైనా విధించిన 'వన్ చైల్డ్' పాలసీ ఫలితంగా జనాభా పెరుగుదల తీవ్రంగా మందగించినట్లు తెలుస్తోంది.
పిల్లల ఉన్నత విద్యకు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో.. అసలు పిల్లలే వద్దని లేదా ఒక్కరు చాలు అని చైనీయులు భావించినట్లు అర్థమవుతోంది. మూడేళ్లుగా అక్కడ అమలవుతున్న జీరో కొవిడ్ విధానమూ మరో కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

దిద్దుబాటు చర్యలు:
పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన చైనా.. జననాలు రేటును పెంచేందుకు చర్యలు చేపట్టింది. స్థానిక ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపులు ఇవ్వడం, సుదీర్ఘ ప్రసూతి సెలవులు, గృహ రాయితీల ద్వారా.. ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రజలను ప్రోత్సహించడానికి 2021 నుండి ప్రత్నిస్తోంది. ఈ చర్యలు కొంతమేర సత్ఫలితాలను ఇస్తాయని భావిస్తున్నారు.

భారత్ ఇందుకు భిన్నంగా..
బేబీ స్త్రోలర్‌ల కోసం ఆన్‌లైన్‌లో శోధించడం 2022లో 17% పడిపోగా.. 2018 నుంచి చూస్తే 41% తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా వృద్ధుల సంరక్షణ గృహాల కోసం శోధనలు ఎనిమిది రెట్లు పెరిగాయి. భారత్‌లో ఈ రేటు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఏటేటా గూగుల్‌లో బేబీ బాటిళ్ల కోసం వెతికే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒక్క 2022లో నే 15% పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications