సిల్వర్ కొంటే లాభాల పంటేనా? వెండి ధర ఎందుకు ఆకాశాన్ని అంటుతోంది?
సాధారణంగా పెట్టుబడి విషయానికి వస్తే అందరి దృష్టి బంగారం (Gold) పైనే ఉంటుంది. కానీ 2025లో.. బంగారాన్ని, స్టాక్ మార్కెట్లను కూడా వెనక్కి నెట్టి.. వెండి (Silver) తన సత్తా చాటింది. ప్రస్తుతం వెండి ధరలు (silver rates) అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ఒక పక్క బంగారం ధరలు పెరుగతూ తగ్గుతూ ఉంటే వెండి ధరలు మాత్రం స్థిరంగా పెరుగుతూ పోతున్నాయి. ఈ ఏడాదిలో వెండి ధరలు భారీగా పెరిగాయి. కొన్ని సందర్భాల్లో బంగారం కంటే వెండి స్థిరమైన పెట్టుబడి అని చలామంది నిపుణులు కూడా సూచించారు. అయితే ఇప్పుడు అదే నిజమవుతోంది. 2025లో సిల్వర్ ధరలు ఔన్స్కు 56.72 డాలర్ల వద్ద ఆల్ టైం హయ్యెస్ట్ ను తాకాయి. కేవలం 24 గంటల్లోనే 6 శాతం జంప్ చేయడం అంటే వెండికి ఎంత బలమైన డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. ఈ పెరుగుదలకు వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు పక్కానా? ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు సిల్వర్ ధర ఇంతలా పెరిగింది?
వెండి పెరుగుదలకు కేవలం ఊహాగానాలు మాత్రమే కాకుండా.. బలమైన ఆర్థిక మార్పులు కారణమని నిపుణులు చెబుతున్నారు.
1. ఫెడ్ రేట్ కోత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ (Fed) చేసిన ఇటీవలి ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఇండియన్ బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ ఆక్ష్ కాంబోజ్ ప్రకారం, డాలర్ విలువ తగ్గుతూ ఉండటం వల్ల పెట్టుబడిదారులు వెండిని ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు.
2. పారిశ్రామిక డిమాండ్
బంగారంలా కాకుండా.. వెండికి పారిశ్రామిక వినియోగం కూడా చాలా ఎక్కువ. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ పరిశ్రమల్లో వెండిని వాడతారు. అందుకే ఆయా పరిశ్రమల నుండి వెండికి మంచి డిమాండ్ ఉంది. ఇలా అధిక డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా మాత్రం పరిమితంగానే ఉంది. దీంతో వెండి ధరలు (silver rates) రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
తర్వాతి లక్ష్యం ఎంత?
నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో వెండి 58 నుంచి 65 డాలర్ల లక్ష్యానికి చేరుకుంటుంది. అయితే ఈ అంచనా కేవలం ఊహాగానాలపై కాకుండా బలమైన ప్రాథమిక అంశాలపై ఆధారపడింది. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, ఫెడ్ వడ్డీ రేటు కోతల అంచనాల వల్ల 'సేఫ్-హేవెన్' (Safe-Haven) ఇన్వెస్ట్ మెంట్స్ పెరుగుతున్నాయి.
పెట్టుబడి పెట్టొచ్చా?
వెండికి స్థిరమైన డిమాండ్ ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి వెండిలో లాంగ్ టర్మ్ పెట్టుబడలు పెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద లాభాలను అందుకునే అవకాశం ఉంది.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)


Click it and Unblock the Notifications