IT news: IT ఉద్యోగులకు ఈ ఏడాది అంతగా బాగున్నట్లు లేదు. గతేడాది సగం నుంచి మొదలైన లేఆఫ్ లు అంతం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క టెక్ కంపెనీలే కాకుండా వివిధ రంగాల్లోని సంస్థలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఓ పక్క లేఆప్ లు మరోపక్క నియామకాల్లో మందగమనం వెరసి ఉద్యోగార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గంపెడు ఆశలతో చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విద్యార్థులకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు.
మూడు టాప్ దేశీయ టెక్ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ మరియు HCL లకు గత ఆర్థిక సంవత్సరం సవాలుగా ఉంది. ఆయా కంపెనీలు నియామకాలను బాగా తగ్గించాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోని లక్షా 97 వేల మంది ఉద్యోగుల చేరికలు.. 2022-23లో దాదాపు 69 వేలకు పడిపోయాయి. అంటే 65 శాతం క్షీణత నమోదైందన్న మాట.

FY2023 నాల్గవ త్రైమాసికంలో నియామకాల్లో తగ్గుదల స్పష్టంగా కనిపించింది. 2022లో ఇదే సమయంతో పోలిస్తే 98.7 శాతం క్షీణత నెలకొంది. మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో TCS, HCLTech మరియు Infosysలు కేవలం 884 మంది ఉద్యోగులను మాత్రమే రిక్రూట్ చేసుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో 68 వేలకుపైగా సిబ్బంది కొత్తగా ఆయా కంపెనీల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Q4లో 821, పూర్తి ఏడాదికి దాదాపు 23 వేల మందిని TCS రిక్రూట్ చేసుకుంది. మార్చి చివరి నాటికి 20.1 శాతం అట్రిషన్ రేటు నమోదు చేసింది. ఇన్ఫోసిస్ నియామకాల్లో గత సంవత్సరం దాదాపు 50 శాతం క్షీణత కనిపించింది. 2022లో నికరంగా సుమారు 22 వేల మందిని చేర్చుకుంది. రాబోయే త్రైమాసికాల్లో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తోంది. ఇక HCL రిక్రూట్‌మెంట్ 57 శాతం పడిపోయింది. గతేడాది Q4లో 353 మందిని నియమించుకోగా.. ఏడాది మొత్తంగా 17 వేల మందికి ఉపాధి కల్పించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications