Rolls Royce: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ అమ్మకాలు రికార్డు సృష్టించినట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోర్‌స్టెన్ ప్రకటించారు. 118 ఏళ్ల కంపెనీ చరిత్రలో తొలిసారి 6,021 కార్లను 2022లో సేల్ చేసినట్లు తెలిపారు. 2021తో పోలిస్తే 8 శాతం వృద్ధిని కనబరిచడంపై హర్షం వ్యక్తం చేశారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పలు కస్టమైజేషన్‌లు చేస్తుండటంతో.. కమిషన్లు సైతం ఎక్కువ మొత్తంలో సంపాదించినట్లు చెప్పారు. దాదాపు అన్ని మోడళ్లూ రాణించడంతో 2022 తమకు మంచి అనుభూతిని మిగిల్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది సైతం మంచి వృద్ధిని సాదించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. 2023కి గాను ఇప్పటికే అడ్వాన్స్‌డ్ బుకింగ్‌లు నమోదు కాగా.. మున్ముందు ఆర్డర్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇవే బెస్ట్ మోడళ్లు :
మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ రీజియన్లలో అమ్మకాలు ముందంజలో ఉండగా.. అమెరికా, ఐరోపాల నుంచి సైతం మంచి డిమాండ్ ఉందని రోల్స్ రాయిస్ తెలిపింది. కల్లినన్, ఘోస్ట్ మోడళ్లు సేల్స్ పరంగా దూసుకుపోతున్నట్లు చెప్పింది. మార్క్యూ విక్రయాలకు అమెరికా పెద్ద మార్కెట్ కాగా.. అగ్రరాజ్య యంగ్ జనరేషన్ ఎక్కువగా వీటిని ఇష్టపడుతుంటారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సైతం కల్లినన్ మోడల్‌ను గతేడాది కొనుగోలు చేశారు.

చైనాలో మాత్రం భిన్నంగా..
చైనా, హాంకాంగ్ లో కొవిడ్ పరిస్థితుల కారణంగా గతేడాది అమ్మకాలు మందగించినప్పటికీ.. ఇతర దేశాల్లో మంచి వృద్ధి కనబరచటంతో ఆ నష్టాన్ని ఎదుర్కొన్నట్లు ఈ బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థ వివరించింది. అక్కడ సైతం ఏడాది మంచి వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది.

ఎలక్ట్రిక్ కార్ల తయారీలోనూ..
ఈ ఏడాది 20 వసంతంలోకి అడుగుపెడుతుండగా.. దీర్ఘకాల ప్రణాళికలతో స్థిరమైన వృద్ధి సాధించేందుకు సిద్ధపడుతున్నట్లు టోర్‌స్టెన్ తెలిపారు. స్పెక్ట్రే పేరుతో ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెడుతున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈ విభాగంలో అనుకున్న దాని కంటే ఎక్కువ ఆర్డర్లు సాధించినట్లు ఆయన చెప్పారు. అవసరాలకు అనుగుణంగా 150 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుని.. తమ సామర్థ్యాన్ని 2500కి పెంచుకున్నామని వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications