Startup Success: ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు వేగంగా పెరిగాయి. ఈ క్రమంలో కొత్తకొత్త వ్యాపార ఆలోచనలతో యువత రంగంలోకి దిగుతోంది. చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలను తీసుకుంటూ తమ నైపుణ్యాలతో విజయాలను సృష్టిస్తోంది.

రియల్టీ రంగంలో..
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా రియల్టీ రంగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కూడా నిలిచింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక యువ వ్యాపారవేత్త కీర్తి చంద్ రెడ్డి నేటి తరం వేగాన్ని అందిపుచ్చుకునే వినూత్న వ్యాపార ఆలోచనతో 'రాజ్ పద్మ ఇన్‌కార్ప్' పేరుతో కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో తన చదువును కొనసాగిస్తున్న యువ వ్యాపారవేత్త.. సెకండ్ జనరేషన్ బిజినెస్‌ను ప్రారంభించానని చెబుతున్నారు.

వ్యాపార స్పెషాలిటీ..
రాజ్ పద్మ ఇన్‌కార్ప్ రియల్టీ రంగంలో సంచలనంగా మారటానికి కారణం వారి వ్యాపారంలోని వినూత్న పద్ధతి. ఈ సంస్థ ముందుగా కస్టమర్ల నుంచి వారి పాత ప్రాపర్టీని తీసుకుంటుంది. దీనికి బదులుగా కస్టమర్ అభిరుచులకు సరిపోయే కొత్త ఇంటిని మరో చోట అంటే కావాల్సిన నగరంలో అందిస్తుంది. బిజీబిజీగా మారిన రోజువారీ జీవితంలో దగ్గరుండి ఇంటిని నచ్చినట్లుగా కట్టించుకోలేని వారికి ఇదొక మంచి ఎంపిక. అలాగే పారిశ్రామిక నగరాలు వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో వారి అవసరాలను వేగంగా తీర్చేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని యువ వ్యాపారవేత్త తన బిజినెస్ మోడల్ గురించి వెల్లడించారు.
ప్రాజెక్టుల డెలివరీ..
కంపెనీ ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా తమ కస్టమర్లకు సమయానికి అందించింది. హైదరాబాదులోని కేపీహెచ్‌బీలో పాత బిల్డింగ్ తీసుకుని.. కడపలో అప్రూవ్డ్ విల్లాస్ జగతి ప్రైమ్ వెంచర్స్‌లో ప్లాట్స్ అందించింది. అలాగే కడపలోనే ఒక ఇల్లు తీసుకుని అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ఎక్స్‌ఛేంజ్ చేసి అందించింది. ఇలా కంపెనీ కార్యకలాపాలను రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ కీర్తి చంద్ రెడ్డి తెలిపారు.

వేగంగా విస్తరణ..
కంపెనీ విస్తరణకు అవసరమైన నిధులను సమీకరించేందుకు రెండేళ్లలో SME కేటగిరీలో లిస్టింగ్ చేస్తామని ప్లాన్ చేస్తున్నారు. అలాగే రానున్న ఐదేళ్లలో ఐపీవోగా స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించి ఈక్విటీ క్యాపిటల్ సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే తన ఆలోచనలో పెట్టుబడులు పెట్టేందుకు కొందరు ఇన్వెస్టర్లతో పాటు, చైన్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా ఆసక్తి కనబరిచాయని సమాచారం. వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పెయిన్, యూకే, జర్మనీ, సింగపూర్‌లలో ఇప్పటికే పర్యటించి సమాచారాన్ని సేకరించటంతో పాటు అనుభవాలను తీసుకున్నట్లు కీర్తి చంద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్- 2023లో తాను పాల్గొన్నట్లు వెల్లడించారు.
More From GoodReturns

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications