real estate: గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ డెవలపర్లు దాదాపు 2 వేల 200 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 26 వేలకోట్లు ఉంటుందని అంచనా. ఈ మొత్తంలో 578 ఎకరాలు(27 శాతం)ను ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే సేకరించారు. ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడానికి వీటిని సమీకరించినట్లు JLL ఇండియా నివేదించింది.
104 వేర్వేరు భూ ఒప్పందాల ద్వారా దాదాపు 209 మిలియన్ చదరపు అడుగుల మేర అభివృద్ధి సామర్థ్యం ఉన్నట్లు JLL అంచనా వేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడిన డిమాండ్ వల్ల అగ్రస్థాయి మెట్రోలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో బ్రాండెడ్ డెవలపర్లు అనేక భూ లావాదేవీలను విజయవంతంగా ముగించారు.

ఢిల్లీ-NCR, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) మరియు బెంగళూరులు ఈ విభాగపు అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచాయి. సేకరించిన భూ విస్తీర్ణంలో 72 శాతం (సుమారు 1,576 ఎకరాలు) ఈ నగరాల్లోనే ఉండగా.. పూణే, కోల్‌కతా మరియు హైదరాబాద్‌లు కలిసి 9 శాతం వాటా కలిగి ఉన్నాయి. సూరత్, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, నాగ్‌పూర్ వంటి నగరాలు మిగిలిన వాటాను ఆక్రమించాయి.
గోద్రేజ్ ప్రాపర్టీస్ , M3M, మాక్స్ ఎస్టేట్స్, బిర్లా ఎస్టేట్స్ మరియు మహీంద్రా లైఫ్ స్పేస్‌లు.. భూమిని పెద్దమొత్తంలో సమీకరించిన రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు. లావాదేవీలు జరిగిన మొత్తం భూభాగంలో 84 శాతం (సుమారు 1,822 ఎకరాలు) నివాసాల అభివృద్ధి కోసం ప్రతిపాదించబడింది. వీటి ద్వారా దాదాపు లక్షా 22 వేల కోట్ల ఆదాయం అంచనా వేయబడింది.


Click it and Unblock the Notifications