స్మార్ట్‌ఫోన్ వాడేవారికి అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది బ్యాటరీ త్వరగా అయిపోవడం. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ మొబైల్ సంస్థ రియల్‌మీ (realme) తన నార్జో సిరీస్‌లో నార్జో పవర్ 5జీ (Realme NARZO Power 5G) అనే సరికొత్త మోడల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో వచ్చిన ఈ ఫోన్ మార్చి 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్ లో అందుబాటులోకి వచ్చింది.

కళ్ళు చెదిరే ఫీచర్లు.. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్
ఈ ఫోన్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన ఫీచర్ దీనిలోని 10,001mAh భారీ బ్యాటరీ. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000mAh బ్యాటరీ చూస్తుంటాం.. కానీ, దానికి రెట్టింపు సామర్థ్యంతో ఈ ఫోన్ రావడం విశేషం. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ బరువు కేవలం 219 గ్రాములు మాత్రమే ఉండటం గమనార్హం. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, దీనివల్ల కేవలం 36 నిమిషాల్లోనే 50% బ్యాటరీ నిండుతుంది. అంతేకాదు దీనికి ఉన్న 'రివర్స్ ఛార్జింగ్' ఫీచర్ తో మీరు ఇతర ఫోన్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
గేమింగ్ కోసం AI చిప్..
డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన HyperGlow 4D Curve+ AMOLED స్క్రీన్ ను అందించారు. ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో మీడియాటెక్ (MediaTek Dimensity 7400 Ultra) ప్రాసెసర్‌ను వాడారు. దీనికి తోడు అదనపు AI చిప్ ఉండటం వల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి IP66, IP68, , IP69 రేటింగ్స్ కూడా ఇచ్చారు.
ఇది నిజంగా బెస్ట్ బడ్జెట్ బ్యాటరీ ఫోనా?
ప్రస్తుతం మార్కెట్లో రూ. 25,000 లోపు లభిస్తున్న ఫోన్లను గమనిస్తే.. ఇంత భారీ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్ మరొకటి లేదనే చెప్పాలి. సాధారణంగా ఎక్కువ బ్యాటరీ ఉంటే ఫోన్ లావుగా, బరువుగా ఉంటుంది. కానీ, రియల్‌మీ సిలికాన్ ఆనోడ్ టెక్నాలజీని వాడి దీనిని స్టైలిష్‌గా రూపొందించింది. రూ. 23,999 ప్రారంభ ధరతో, 4 ఏళ్ల బ్యాటరీ వారంటీ , రూ. 3,999 విలువైన లాంచ్ ఆఫర్లను కలుపుకుంటే.. ఇది ఒక వాల్యూ ఫర్ మనీ డీల్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టే తీరిక లేకుండా నిరంతరం ట్రావెలింగ్ చేసేవారికి, గంటల తరబడి గేమింగ్ ఆడేవారికి, వీడియోలు చూసేవారికి ఇది ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న అత్యుత్తమ 'బడ్జెట్ బ్యాటరీ ఫోన్' అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ధర.. లభ్యత..
ఇక ధరల విషయానికొస్తే.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB/128GB వేరియంట్ ధర రూ. 23,999 కాగా, 8GB/256GB మోడల్ కూడా అందుబాటులో ఉంది. టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ రంగుల్లో మెరిసిపోతున్న ఈ ఫోన్ నేటి నుంచే అమ్మకానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications