రూ. 31,999 కే 200MP కెమెరా ఫోన్..! Realme 16 Pro కొనడం లాభమేనా? ఈ బడ్జెట్‌లో ఇది బెస్ట్ డీల్ అవుతుందా?
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. తాజాగా రియల్‌మీ కంపెనీ తన ప్రతిష్టాత్మక రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro), 16 ప్రో+ మోడళ్లను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ నిజంగా వ్యాల్యూ ఫర్ మనీయేనా? ఈ బడ్జెట్ లో ఈ మోడల్ ఏ మేరకు రాణిస్తుంది? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

ధరల వివరాలు (Price & Offers)
రియల్‌మీ బ్రాండ్.. మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఈ సిరీస్ ను లాంఛ్ చేసింది.
- Realme 16 Pro: ప్రారంభ ధర రూ. 31,999.
- Realme 16 Pro+: ప్రారంభ ధర రూ. 39,999.
ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ మొబైల్ కొనేవారు నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) ద్వారా కొనొచ్చు. అలాగే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ల వంటివి కూడా ఉంటాయి. EMI ద్వారా కొనేవాళ్లు నెలవారీ వాయిదా కేవలం రూ. 2,500 - రూ. 3,000 లోపు ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ మీ డబ్బుకు 'వర్త్' అవుతుందా?
సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఉండే 200MP కెమెరా, 120X సూపర్ జూమ్ వంటి ఫీచర్లను రియల్‌మీ ఈ మిడ్-రేంజ్ ధరకే అందిస్తోంది. ముఖ్యంగా Realme 16 Pro+ లో ఉన్న పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఈ సెగ్మెంట్‌లో మరే ఇతర బ్రాండ్‌లోనూ లేదు. దీనివల్ల రూ. 70,000 పెట్టాల్సిన చోట సగం ధరకే ఆ అనుభూతిని పొందవచ్చు. అంటే కస్టమర్ దృష్టిలో ఇది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్.
సెకండరీ మార్కెట్ విలువ
ఫోన్ కొనేటప్పుడు అందులోని ఫీచర్లతోపాటు ఫోన్ మన్నిక గురించి కూడా తెలసుకోవడం ముఖ్యం. రియల్‌మీ ఈసారి 'అర్బన్ వైల్డ్ డిజైన్'తో పాటు IP69 రేటింగ్ ఇచ్చింది. అంటే ఫోన్ ఎక్కువ కాలం మన్నుతుంది. అలాగే రియల్‌మీకి ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ వల్ల, భవిష్యత్తులో ఈ ఫోన్‌ను రీసేల్ (Resale) చేసినా మంచి ధర లభించే అవకాశం ఉంది.
ప్రోడక్ట్ ఎకోసిస్టమ్ విస్తరణ
రియల్‌మీ కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా, రియల్‌మీ ప్యాడ్ 3 (రూ. 26,999), బడ్స్ ఎయిర్ 8 (రూ. 3,799) కూడా విడుదల చేసింది. ఇది ఒక పూర్తి స్థాయి బిజినెస్ స్ట్రాటజీ. కస్టమర్ ఒకేసారి ఫోన్, ట్యాబ్, బడ్స్ కొనేలా ఆకర్షణీయమైన బండిల్ ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా కంపెనీ తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది.
ఫీచర్లు ఇవీ..
ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉంటుంది. ఇందులో 6.8-అంగుళాల 1.5K కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇక Realme 16 Pro మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్లలో కూడా భారీ 7,000mAh బ్యాటరీని అమర్చారు
కొనాలా? వద్దా?
మీరు రూ. 32,000 నుంచి రూ. 40,000 బడ్జెట్‌లో ఒక ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ కోసం వెతుకుతుంటే.. Realme 16 Pro సిరీస్ ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి, కంటెంట్ క్రియేటర్లకు ఇది తక్కువ ధరలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్. లాంచ్ ఆఫర్లలో భాగంగా లభించే బ్యాంక్ డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే, ఈ డీల్ మరింత లాభదాయకంగా మారుతుంది. మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది!


Click it and Unblock the Notifications