చాలా సంవత్సరాల నుంచి స్థిరాస్తి అంటే ప్రతి కుటుంబానికి ఒక కలగా ఉంటుంది. అందరూ ఓ ఇంటిని కొనుగోలు చేయడం అంటే భద్రత, గౌరవం, సంపద అని భావించేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. కాలానుకుణంగా సంపదను పెంచే మార్గాలు కూడా మారాయి. నేటి రోజుల్లో పెరిగిన ఖర్చులు, ఎక్కువైన ఫైనాన్షియల్ ఉత్పత్తుల మధ్య మీ మొత్తం డబ్బును స్థిరాస్తిలో పెట్టడం బుద్ధిమత్తయిన నిర్ణయమా? లేక మ్యూచువల్ ఫండ్స్ వైపు చూడాలా? అనే సందేహం చాలామందికి కలుగుుతుంది.
రియల్ ఎస్టేట్ vs మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండింటిలో దేనిలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయనే దానిపై చాలామంది అయోమయానికి గురవుతుంటారు. అయితే నిపుణులు దీనిపై పలు సలహాలు ఇస్తున్నారు.. స్టాక్ మార్కెట్ నిపుణుడు రాజ్నిష్ మెహాన్ లింక్డ్‌ఇన్‌లో దీనిపై ఓ విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు.ఎందులో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు వస్తాయో చెప్పుకొచ్చాడు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. రియల్ ఎస్టేట్‌కు పూర్వం రోజుల్లోనే గొప్ప ప్రాముఖ్యత ఉండేది, రెండు రెట్లు సంపదలో ఉన్నప్పుడు అది ఇంకా డిమాండ్ తో ఉండేది. అయితే కాలం మారిన కొద్దీ ఇది ఈ కాలంలో మళ్లీ ఆలోచించాల్సిన అంశంలా మారిందని చెప్పుకొచ్చాడు. 2005లో పని చేసిన విధానం 2025లో పని చేయకపోవచ్చని తెలిపాడు.ఇంతకాలం ఇంటి కొనుగోలు లేదా ప్లాట్ కొనడం అంటే సంపద ఏర్పరచుకోవడంలో ప్రధాన మార్గంగా భావించేవారు. ఆస్తి కొనే వారు ప్రధానంగా ఉన్నత రాబడులు, సొంత ఇంటి కల, వంటి కారణాలతోనే ఎక్కువ ఇష్టపడేవారు..
అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. గతంలోలా రెండు రెట్లు సంపద అనేది దొరకడం ఇప్పుడు చాలా అరుదు. అనేక నగరాల్లో స్థిరాస్తి ధరలు తగ్గుముఖం పట్టాయి. అద్దె ద్వారా వచ్చే ఆదాయం కూడా స్థిరంగా ఉండటం లేదు. అలాగే స్థిరాస్తిని విక్రయించడం కూడా నెలల తరబడి పట్టే ప్రక్రియగా మారింది. ఇక ఆస్తిని కొనుగోలు చేయడంలో పెద్ద మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దీని మీద నిర్వహణ ఖర్చులు, పన్నులు, చట్టపరమైన పనులు అన్నీ అదనపు భారంగానే మారిపోయాయి.
ఈ క్రమంలోనే మ్యూచువల్ ఫండ్స్ యువత, మధ్యతరగతి పెట్టుబడిదారులలో మరింత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఇవి సెబీ నియంత్రణలో ఉంటాయి. అలాగే స్పష్టమైన నియమాలతో పనిచేస్తాయి, చిన్న మొత్తాలను SIPల ద్వారా పెట్టుబడి చేసే అవకాశం ఇస్తాయి. ఒక్కో నెలకు రూ. 500తో కూడ పెట్టుబడి మొదలుపెట్టవచ్చు. ఎలాంటి నిర్వహణ అవసరం లేదు, లీగల్ తలనొప్పులు అసలు లేవు. డైవర్సిఫికేషన్ పక్కాగా ఉంటుంది.
రాజేష్ ఏమంటున్నారంటే.. పెద్ద మొత్తాలను లాక్ చేయడం కన్నా, చిన్న SIPలతో పెట్టుబడిని ప్రారంభించడం యువతకు ఉత్తమ మార్గం. ఇది సేవింగ్స్ అలవాటు పెంచుతుంది, దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మంచి పొదుపు ఉన్నవారు, సంవత్సరాల తరబడి ఆస్తిని ఉంచగలిగే వారు, డైవర్సిఫికేషన్ కోసం స్థిరాస్తిని పరిశీలించవచ్చు. కానీ, రూ.50 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటే, ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నప్పుడు ఇది మళ్లీ ఆలోచించాల్సిన విషయంగా చెబుతున్నారు.
మధ్యతరగతి పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవచ్చో, ఆస్తిని అమ్మడం ఎంత క్లిష్టమో గుర్తించాలి. స్థిరాస్తి అంటే తక్షణ లిక్విడిటీ లేకపోవడం ఒక ప్రధాన ప్రతిబంధంగా చెప్పుకొచ్చు.ఏదేమైనా ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications