Real Estate vs Gold: బంగారంలో పెట్టుబడి ..రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, ఏది అధిక లాభాలు ఇస్తుందో తెలుసుకోండి

Real Estate vs Gold: భారతదేశంలో అనాదిగా పెట్టుబడి పెట్టే రంగాలు అంటే రెండే గుర్తుకు వస్తాయి. వాటిల్లో ఒకటి బంగారం లేదా స్థిరాస్తి (రియల్ ఎస్టేట్). ఈ రెండింటిలో బంగారం భద్రత, సాంస్కృతిక విలువల కోసం ఎప్పుడూ ప్రజల మొదటి ఎంపికగా ఉంటుంది.అయితే రియల్ ఎస్టేట్ మాత్రం దీర్ఘకాలిక ఆదాయం పాటుగా విలువ పెరుగుదలతో పాటు అద్దె ఆదాయాన్ని కూడా అందించే వాస్తవికమైన ఆస్తిగా నిలుస్తోంది.

ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఈ రెండింటిలో పెట్టుబడులను ఎక్కువగా పరిశీలిస్తున్నారు. మరి ఆదాయానికి ఏది ఉత్తమం.. ఏ రంగంలో ఎక్కువ లాభాలు ఉంటాయి? ఈ ఏడాది..ఆ తర్వాత కాలంలో తెలివైన పెట్టుబడి ఎక్కడ పెట్టవచ్చు వంటి విషయాలపై చాలామందిలో సందేహం నెలకొని ఉంటుంది.

Real Estate Gold Investment Property vs Gold Long-term Investment Wealth Creation Safe Investment Gold vs Property Real Estate Returns Inflation Hedge Asset Comparison Investment Tips Financial Planning Gold Price Real Estate Market Investment Guide Future Investment Gold Security Real Estate Growth SIP vs Property Gold Returns vs vs SIP vs vs

తాజాగా డేటా ప్రకారం 2034 నాటికి భారత రియల్ ఎస్టేట్ విలువ మూడు రెట్లు పెరిగి USD 1.5 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా.దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. 2034 నాటికి 42.5 శాతం మంది భారత జనాభా పట్టణాల్లో నివసించనుంది. దీంతో కొత్తగా 78 మిలియన్ ఇళ్లకు డిమాండ్‌ ఏర్పడనుంది. ఈ కారణాలన్నీ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు భారీ అవకాశాలను కల్పిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ డీల్స్ CEO వినీత్ చెల్లానీ చెప్పినట్లు.. బంగారం లాకర్‌లో ఉంటే.. రియల్ ఎస్టేట్ నగరాలను నిర్మిస్తుంది. ప్రతి చదరపు అడుగు భవిష్యత్తులో నగర రూపాంతరానికి పెట్టుబడిగా నిలుస్తుంది.

RBI గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే.. రియల్ ఎస్టేట్ వార్షికంగా 8-10 శాతం విలువతో పెరుగుదలను ఇస్తుంది. బంగారం మాత్రం 6-7 శాతంతో లాభమే ఇస్తుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి అనంతరం రియల్ ఎస్టేట్ 15 శాతం CAGRతో స్థిరమైన వృద్ధిని చూపుతోంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) ప్రవేశంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. ప్రాజెక్ట్ నిధుల్లో 70 శాతం వరకు ఎస్క్రో ఖాతాల్లో ఉంచాలనే నిబంధన వల్ల కొనుగోలుదారులు సురక్షితంగా ఉన్నారు.

అలాగే REITs (Real Estate Investment Trusts), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) లాంటి పథకాలతో రియల్ ఎస్టేట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.రియల్టర్స్ చానల్ సేల్స్ హెడ్ డింపుల్ భర్ద్వాజ్ చెప్పినట్లుగా.. RERA తరువాత రియల్ ఎస్టేట్ బాగా స్ట్రక్చర్‌డ్ తో కూడుకుని తక్కువ రిస్క్ పెట్టుబడిగా మారింది. పాలసీలకు అనుగుణంగా పన్ను మినహాయింపులు, సెక్షన్ 80C, 54 ప్రయోజనాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.

రియల్ ఎస్టేట్ ద్వారా రెండు రకాల లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి విలువ పెరుగుదల, రెండు అద్దె ఆదాయం. బ్యాంకులు 80 శాతం వరకు లోన్ ఇస్తాయి. అద్దె ఆదాయంతో EMIs కట్టవచ్చు. అంతేకాదు, వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. నోయిడా, పుణె వంటి పట్టణాల్లో అద్దె దిగుబడి 2-4 శాతం వరకు ఉంటుంది. అయితే బంగారం పరంగా చూసుకున్నట్లయితే దాని విలువ నిలకడగా ఉన్నప్పటికీ అది అదనపు ఆదాయం ఇవ్వదు. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం నిలకడను, భద్రతను, ఆదాయాన్ని కలిగిస్తుంది.

M2K గ్రూప్ మార్కెటింగ్ హెడ్ విశేష్ రావత్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ ద్వారా ఉన్నతమైన, స్థిరమైన ఆదాయం వస్తుంది. రుణం ద్వారా ఆస్తిని సృష్టించవచ్చు. అద్దె సేవింగ్‌తో EMIలు చెల్లించి, విలువ పెరుగుదల ప్రయోజనాన్ని పొందవచ్చని చెబుతున్నారు. అయితే బంగారంలో ఈ ఆప్సన్ ఉండదని కూడా చెబుతున్నారు.

ఏదేమైనా.. బంగారం సంస్కృతికి ప్రతీక, కానీ రియల్ ఎస్టేట్ సంపద సృష్టికి మార్గం. 2034 నాటికి భారత GDPలో 10.5 శాతం భాగాన్ని రియల్ ఎస్టేట్ ఇవ్వనుంది. అందుకే, తెలివైన పెట్టుబడిదారులకు స్థిరాస్తిలో పెట్టుబడి భవిష్యత్‌లో మెరిసే అవకాశాన్ని ఇస్తుంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+