నెలకి రూ. 20 లక్షలు జీతం.. అయినా సొంత ఇల్లు లేక భోరుమంటున్న ఉద్యోగి

దేశంలో రియల్ ఎస్టేట్ అపరిమిత వేగంతో దూసుకుపోతోంది. ఈ నగరంలో చూసిన భారీగా ధరలు ఉన్నాయి. సామాన్యుడు నగరంలో ఇళ్లు కొనలేని పరిస్థితి ఉంది. అతను చేసే ఉద్యోగం ఉద్యోగి నెలవారీ ఖర్చులకే సరిపోవడం లేదు. అలాంటి సమయంలో ఆ ఉద్యోగి ఇల్లు కొనడం కలగానే మారిపోతోంది. అయితే ఇది సామాన్యులకు మాత్రమే కాదు.. లక్షలు జీతాలు తీసుకుంటున్న వారి పరిస్థితి కూడా ఇదేనని చెప్పవచ్చు. వారు జీతాలు లక్షల్లో ఉన్నా ఫ్లాట్ కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు.

తాజాగా గురుగ్రామ్ నుంచి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించే ఓ ఉద్యోగి గురుగ్రామ్ లో ఇప్పటికీ అపార్ట్‌మెంట్‌ కొనలేని స్థితిలో ఉన్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలపై తీవ్రమైన చర్చకు ఈ పోస్ట్ తెరలేపింది. ఆ పోస్టులో ఉద్యోగి నెలకు అన్ని ఖర్చులు పోను రూ.1.2 లక్షలు మిగులుతున్నా తాను ఉంటున్న నగరంలో ఒక ఇంటిని కొనులేని పరిస్థితిలో ఉన్నాడని ఆ ఉద్యోగి ఫ్రెండ్ రియల్ బూమ్ గురించి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.

Gurgaon real estate prices techie housing affordability 1 2 lakh salary housing issue unaffordable flats in Gurgaon techie struggles to buy home IT professional real estate problems Gurgaon flat prices 2025 urban housing crisis India real estate affordability India home buying challenges for salaried class middle class housing issue high income low affordability 1 2

అఖిలేష్ అనే ఓ వ్యక్తి తన స్నేహితుడి పరిస్థితి గురించి ఎక్స్ వేదికగా రాస్తూ.. కారు లేదు, పిల్లలు లేరు,సాధారణ జీవితం.. అతని భార్యతో కలిసి ఇద్దరే ఉంటారు. ఏడాదికి రూ.20 లక్షల సీటీసీ వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.పన్నులు, ఈపీఎఫ్, మినహాయింపులు తర్వాత నెలకు రూ.1.2 లక్షలు మిగులు ఉంటుంది.చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటాడు. అయితే ఇల్లు కొందామని ఎంత ప్రయత్నించినా అతనికి సాధ్యం కావడం లేదని తెలిపారు.

ఇంకా అతను మాట్లాడుతూ..ప్రతి ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్‌ విలువ రూ.2.5 కోట్లతో ప్రారంభమవుతుంది. ఇన్ఫినిటీ పూల్స్, జెన్ గార్డెన్స్, ఇటాలియన్ మార్బుల్, బయోమెట్రిక్ లిఫ్టుల గురించి బ్రోచర్లలో ఊకదంపుడు విన్యాసాలు చేస్తున్నారు. పొరపాటున నా స్నేహితుడు ఈ అపార్ట్ మెంట్ కొనుగోలు చేస్తే కేవలం అతను జీతం కోసం బతకాల్సి ఉంటుంది. బఫర్ మనీతో పాటుగా సెలవులు ఉండవు. ఎమర్జెన్సీ ఉండదని అభిప్రాయపడ్డాడు.

భారతీయ ఉద్యోగులలో సంపాదనలో టాప్ 5శాతం లో ఉన్నప్పటికీ, మెట్రో నగరంలో మంచి ఇంటిని కలిగి ఉండటం సాధ్యం కావడం లేదని, ఆదాయం, పట్టణ గృహాల ధరల మధ్య పెరుగుతున్న ఆందోళనను ఈ పోప్ట్ హైలైట్ చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలోని జీతాలు పొందే మధ్యతరగతి ప్రజలలో పెరుగుతున్న నిరాశను ఈ పోస్ట్ చెబుతోందని ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు.

దేశంలో చాలామంది ఉద్యోగులు ఎంత సంపాదించినా ఇప్పటికీ తాను నివసిస్తున్న నగరంలో ఇల్లు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రియల్టీ వ్యాపారం పెరుగుతోందా..? జీతాలు తగ్గుతున్నాయో అర్థం కావడం లేదు' అని ఒకరు రిప్లై ఇస్తే..మరొకరు గుర్‌గావ్‌ పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉందని కామెంట్ చేశారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+